అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2 నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు

HIGHLIGHTS

ప్రైమ్ సభ్యుల కోసం ఈ డీల్స్ ను ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చింది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2 నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరొక సరి ప్రారంభమైంది, అయితే, ఈరోజు కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే. ఈ రోజు మనం స్మార్ట్‌ ఫోన్‌లపై ప్రత్యేక డీల్స్ గురించి చుడనున్నాము. మీరు మంచి డీల్స్ తో కొనగల స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తూన్నట్లైయితే ఈ స్మార్ట్‌ ఫోన్ల డీల్స్  చూడవచ్చు. అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు జరుగుతుంది, కాని ప్రైమ్ సభ్యుల కోసం ఈ డీల్స్ ను ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ నుండి ICICI డెబిట్ మరియు క్రెడిట్ కారులతో ప్రొడక్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Readmi 7 A

MRP : రూ .6,999

అఫర్ ధర: రూ .6,199

ఈ రెడ్మి 7 ఎ యొక్క 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం 5,499 రూపాయలకు లభిస్తుంది. రెడ్మి7 ఎ ఫోన్ ఒక 5.45 అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే మరియు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 486 సెన్సార్ ఉంది. ఈ ఫోనులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం PDAF, ఆటో హెచ్‌డిఆర్ మరియు సింగిల్-టోన్ ఫ్లాష్‌తో వస్తుంది, అంతేకాకుండా సెల్ఫీ కెమెరా AI బ్యాక్‌గ్రౌండ్ బ్లర్రింగ్ మరియు AI బ్యూటిఫికేషన్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M 30

MRP : రూ .16,490

అఫర్ ధర: రూ .11,999

ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ M  30 గురించి మాట్లాడితే, ఈ పరికరం రూ .11,999 కు లభిస్తుంది. ఈ పరికరం 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 ఇన్ఫినిటీ-యు నాచ్‌తో ఒక 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ SoC ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

Redmi Y 3

MRP : రూ .11,999

అఫర్ ధర: రూ .7,999

రెడ్మి వై 3 స్మార్ట్‌ఫోన్ కేవలం 7,999 రూపాయలకు ధరకు లభిస్తుంది. ఈ రెడ్మి వై 3 లో, మీరు HD + ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లేని ఒక 6.26 అంగుళాల డాట్ నాచ్ డిజైనుతో  పొందుతారు. అలాగే, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇవ్వబడింది. ఈ పరికరం సొగసైన బ్లూ, బోల్డ్ రెడ్ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్‌లో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఒక ఆరా ప్రిజం డిజైన్‌తో వస్తుంది.

OnePlus 7 Pro

MRP: రూ .48,999

అఫర్  ధర: రూ .42,999

వన్ ప్లస్ కొత్తగా లాంచ్ చేసిన ఈ OnePlus 7 Pro స్మార్ట్ ఫోన్‌ రూ .42,999 వద్ద 12% తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.67-అంగుళాల QHD  స్క్రీన్‌ మరియు 48 MP  ప్రైమరీ సెన్సార్ ఒక ఎపర్చరు ఎఫ్ / 1.7 తో మరియు సెకండరీ 8MP టెలీఫోటో సెన్సారుకు జతగా 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP పాప్ అప్ సెల్ఫీ ఇవ్వబడింది. ఈ ఫోన్, ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. 

Apple iPhone XR

MRP : రూ .54,900

అఫర్ ధర: రూ .47,999

ఈ ఆపిల్ ఫోన్ పైన 13% తగ్గింపు తరువాత, మీరు దీన్ని 47,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మరియు ఈ వేరియంట్లో A12 బయోనిక్ చిప్ తో వస్తుంది మరియు ఇది IP 67 సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ నుండి రక్షణ నిస్తుంది.

Nokia 8.1

MRP: రూ .28,831

అఫర్  ధర: రూ .13,999

అమెజాన్ గ్రేట్ ఇండియన్  సేల్‌లో ఈ నోకియా స్మార్ట్‌ ఫోన్‌ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ నోకియా 8.1 ఫోనులో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడుతుంది, మరియు కెమేరాల పరంగా చాల బాగుటుంది. ఈ ఫోన్ను ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో అందించారు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile