Ai Plus Smartphone డిటైల్స్ విడుదల చేసిన కంపెనీ.. ఫోన్ ఎలా ఉందంటే.!
Ai Plus Smartphone లాంచ్ డేట్ వివరాలు ఎట్టకేలకు విడుదల చేసింది
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు ఫీచర్లు ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజి నుంచి అందించింది
ఈ ఫోన్ పూర్తిగా ఇండియాలో నిర్మితమైన ఫోన్ గా కంపెనీ చెబుతోంది
చాలాకాలంగా ఫ్లిప్ నుంచి టీజింగ్ చేస్తున్న Ai Plus Smartphone లాంచ్ డేట్ వివరాలు ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు ఫీచర్లు ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజి నుంచి అందించింది. ఈ ఫోన్ పూర్తిగా ఇండియాలో నిర్మితమైన ఫోన్ గా కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను నడిపించే ఆపరేటింగ్ సిస్టం కూడా ఇండియాలో నిర్మితమైనది కావడం విశేషం. ఈ ఫోన్ డేటా ఇండియాలో స్టోర్ చేయబడుతుందని కూడా కంపెనీ తేలింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న ఆ వివరాలు ఏమిటో ఒక్క లుక్కేద్దామా.
SurveyAi Plus Smartphone : లాంచ్
ఎఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను జూలై నెలలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ కొత్తగా ఇండియాలో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం చాలా రోజులుగా ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ పూర్తి ఇండియా ఫోన్ గా కమ్ కంపెనీ అభివర్ణిస్తోంది.
Ai Plus Smartphone : ఫీచర్స్
ఎఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కీలక వివరాలు అందించింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 5 బోల్డ్ కలర్స్ లో లాంచ్ అవునట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా తో లాంచ్ అవుతున్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా పెద్ద బంప్ లో అందించింది మరియు ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆటో ఫోకస్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఇక ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) అప్రూవ్డ్ సర్వర్స్ తో ఈ ఫోన్ డేటా పుర్తిగా ఇండియాలో స్టోర్ అవుతుందని మరియు సేఫ్ గా ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ NxtQ OS లాంచ్ అవుతుందని కూడా ఈ ఫోన్ తయారీ కంపెనీ తెలిపింది.
Also Read: Password Manager: మీ పాస్వర్డ్ ను వెంటనే చేంజ్ చేయండి.. లేకపోతే మీ అకౌంట్ అధోగతే.!
ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ గా కనిపిస్తోంది మరియు రౌండ్ కార్నర్ డిజైన్ కలిగి ఉంటుంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ లను మూడు కలర్ వేరియంట్స్ లో చేస్తుంటే, ఈ ఫోన్ మాత్రం ఐదు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోజి లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.