OnePlus Buds 4: వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ తో పాటు కొత్త బడ్స్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అదే వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను స్మూత్ సౌండ్ మరియు స్మార్ట్రర్ సైలెన్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. గొప్ప లీనమయ్యే సౌండ్ కోసం ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ ను అందించినట్లు వన్ ప్లస్ వెల్లడించింది.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Buds 4 : లాంచ్
వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ని కూడా వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు జూలై 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ కలిగిన కీలక ఫీచర్లు కూడా వన్ ప్లస్ వెల్లడించింది. ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ బడ్స్ వివరాలతో టీజింగ్ చేస్తోంది.
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను అదే ఓవల్ షేప్ డిజైన్ తో అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను డ్యూయల్ డ్రైవర్ (స్పీకర్) సెటప్ తో అందిస్తుంది. ఇందులో, 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ రెండు స్పీకర్లు ఉంటాయి. ఇందులో బెస్ట్ ఉఫర్ కోసం డ్యూయల్ డాక్ సెటప్ కూడా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ను ప్రీమియం సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపే మరో రెండు ఫీచర్స్ కూడా ఉన్నాయి.
వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ 1 Mbps బిట్ రేట్, 24 బిట్ డెప్త్ మరియు 192 kHz శాంపిల్ రేట్ తో గొప్ప హై రెజల్యూషన్ సౌండ్ అందిస్తుందని వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ బడ్స్ LHDC 5.0 మరియు Hi-Res ఆడియో వైర్లెస్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ స్టూడియో గ్రేడ్ సూపర్ సౌండ్ ఆఫర్ చేస్తుందని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.
ఈ బడ్స్ లో లోతైన బాస్, క్రిస్పీ ట్రబుల్ మరియు డైనమిక్ సౌండ్ అందించే 3D స్పటియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ బడ్స్ లాంచ్ నాటికి ఈ బడ్స్ కలిగిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ కూడా వెల్లడించే అవకాశం ఉంది.