బిగ్ డిస్కౌంట్ తో 21 వేల బడ్జెట్ లో లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv డీల్ గురించి మీకు తెలుసా? ఈరోజు ఈ డీల్ గురించి చూడనున్నాము. స్మార్ట్ టీవీలు ప్రస్తుతం బడ్జెట్ ధరలో కూడా మంచి ఫీచర్స్ తో లభిస్తున్నాయి. ఒకప్పుడు 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలంటే కనీసం 35 వేల రూపాయలైనా ఖర్చు చేయవలసి వచ్చేది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డీల్ తో 50 ఇంచ్ స్మార్ట్ టీవీని కేవలం 21 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం వుంది.
Survey
✅ Thank you for completing the survey!
50 ఇంచ్ Smart Tv ఆఫర్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson యొక్క OP MAX సిరీస్ నుంచి అందించిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 45% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ TQLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ మరియు స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ మీడియాటెక్ Quad-core ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ థాంసన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.