విడుదలకు ముందే లీకైన Redmi Note 13 Pro ఇండియా వేరియంట్ ధర.!
భారత మార్కెట్ లో రెడ్ మి నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది
ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తునట్లు షియోమి అనౌన్స్ చేసింది
వీటిలో Redmi Note 13 Pro రేటు ఇప్పుడు ఆన్లైన్ లీక్ అయ్యింది
భారత మార్కెట్ లో రెడ్ మి నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ ఫోన్ లను జనవరి 4 న విడుదల చేస్తునట్లు కంపెనీ ప్రకటించగా, ఈ ఫోన్స్ లాంచ్ కంటే ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తునట్లు షియోమి అనౌన్స్ చెయ్యగా, వీటిలో Redmi Note 13 Pro రేటు ఇప్పుడు ఆన్లైన్ లీక్ అయ్యింది.
SurveyRedmi Note 13 Pro Leaked Price
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధర వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ ను ట్వీట్ చేశారు. ఈ ఫోన్ యొక్క 12GB+256GB వేరియంట్ బాక్స్ ప్రైస్ ను రూ. 32,999 అని ధర వివరాలను లీక్ చేశారు. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క చైనీస్ వేరియంట్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను కూడా ఈ ట్వీట్ నుండి షేర్ చేశారు.
Exclusive 🌠 ✨
— Abhishek Yadav (@yabhishekhd) December 20, 2023
Redmi Note 13 Pro Indian variant box price of 12GB+256GB 💰 ₹32,999 👀
Chinese variant specifications ⬇️
📱 6.67" 1.5K OLED TCL C7 12bit display, 120Hz refresh rate, 1800nits peak brightness, 1920Hz PWM, Gorilla glass victus
🔳 Snapdragon 7s Gen 2 – 4nm… pic.twitter.com/gHSBY0ZRXj
అంటే, ఈ ట్వీట్ ను బట్టి ఈ స్మార్ట్ ఫోన్ దాదాపుగా చైనీస్ లో విడుదలైనరెడ్ మి నోట్ 13 ప్రో వేరియంట్ ను పోలి ఉంటుందని చెబుతన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి అధికారిక వివరాల కోసం వేచి చూడవలసి ఉంటుంది.
Also Read : X-mas Gift Idea: మీకు నచ్చిన వారికి బడ్జెట్ ధరలో మంచి గిఫ్ ఇవ్వాలనుకుంటున్నారా.!
రెడ్ మి నోట్ 13 ప్రో (చైనా వేరియంట్) స్పెక్స్
రెడ్ మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ను 6.67 ఇంచ్ సైజు గల 1.5K రిజల్యూషన్ OLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఇండియన్ వేరియంట్ లో కూడా ఇదే ప్రోసెసర్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 200MP OIS Samsung HP3 మెయిన్ కెమేరా జతగా 8MP+2MP కెమేరాలతో ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది.
రెడ్ మి నోట్ 13 ప్రో చైనీస్ వేరియంట్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 బ్యాటరీని కలిగి వుంది. ఇందులో, X-axis లైనర్ మోటార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP54 రేటింగ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
అయితే, ఇండియన్ వేరియంట్ వివరాలు షియోమి పూర్తిగా వెల్లడించ లేదు.