రూ. 7000 ధరలో జబర్దస్త్ సౌండ్ అందించే బెస్ట్ 5.1 Dolby Soundbar ఆప్షన్ పై ఒక లుక్కేయండి.!
ఈ సినిమా లను పెద్ద స్మార్ట్ టీవీ లలో చూడటం థియేటర్ ఫిల్ అందిస్తుంది
అయితే, దానికి తగిన సౌండ్ బార్ ఉంటే ఆ మజానే వేరు
థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందించే బెస్ట్ 5.1 Dolby Soundbar ఆప్షన్
ప్రస్తుతం OTT ప్లాట్ ఫామ్స్ దెబ్బకి ఇల్లే సినిమా థియేటర్ గా మారిపోతున్నాయి. సూపర్ హిట్ మూవీస్ సైతం రిలీజైన 6 నుంచి 10 వారాల్లో ఓటిటీ లో రిలీజ్ అవ్వడం, ఈ సినిమా లను పెద్ద స్మార్ట్ టీవీ లలో చూడటం థియేటర్ ఫిల్ అందిస్తుంది. అయితే, దానికి తగిన సౌండ్ బార్ ఉంటే ఆ మజానే వేరు. అందుకే, ఈరోజు మీ స్మార్ట్ టీవీతో అనుసంధానమై సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందించే బెస్ట్ 5.1 Dolby Soundbar ఆప్షన్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
Surveyఏమిటా బెస్ట్ 5.1 Dolby Soundbar ఆప్షన్స్?
వాస్తవానికి, సౌండ్ బార్ ధరలు ఈ మధ్య కాలంలో బాగానే తగ్గాయని చెప్పాలి. ప్రస్తుతం కేవలం 5 వేల నుంచి 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే 2.1 ఛానల్ డాల్బీ సౌండ్ లు లభిస్తున్నాయి. అయితే, డీసెంట్ సౌండ్ అందించే 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ కావాలంటే కనీసం 7 నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈరోజు కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ ఆప్షన్ మీకోసం అందిస్తున్నాయి. ఆఫ్ కోర్స్, ఈ సౌండ్ బార్ పై అందించిన బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధరలో లభిస్తాయి అని గుర్తుంచుకోవాలి.

MOTOROLA AmphisoundX Vibe
ఇది మోటోరోలా అందించి 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి అన్ని ఆఫర్స్ కలుపుకుని కేవలం రూ. 7,200 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వస్తుంది మరియు 500W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ తో కలిగి ఉంటుంది. ఇది 4K ఆడియో, ప్రీమియం డిజైన్ మరియు 3D సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ అవుతుంది.
Also Read: Flipkart End Of Season Sale నుంచి కేవలం 43 ఇంచ్ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తోంది.!
ZEBRONICS Juke Bar 9400 Pro
జెబ్రోనిక్స్ నుంచి వచ్చిన బెస్ట్ సౌండ్ బార్ లలో ఒకటిగా ఇది యూజర్ల మన్నన అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ ఆఫర్ తో కేవలం రూ. 7,650 ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మెటల్ గ్రిల్ కలిగిన ప్రీమియం డిజైన్ తో వస్తుంది మరియు సింపుల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది కూడా మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు సినిమా హల వంటి ఫీల్ అందిస్తుంది.