Oneplus Pad Go 2 : రీసెంట్ గా వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వన్ ప్లస్ ఇప్పుడు వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ మరియు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 రెండు డివైజెస్ లాంచ్ చేస్తోంది. వీటిలో వన్ ప్లస్ ప్యాడ్ గో 2 డివైజ్ ను బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాడ్ లాంచ్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Oneplus Pad Go 2: లాంచ్ డేట్
వన్ ప్లస్ ప్యాడ్ గో మరియు వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ రెండు కూడా డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో జరిగే ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్ నుంచి లాంచ్ అవుతాయి. ఈ అప్ కమింగ్ ప్యాడ్ మరియు స్మార్ట్ ఫోన్ కీలక స్పెక్స్ అండ్ ఫీచర్స్ కూడా కంపెనీ రివీల్ చేసింది.
వన్ ప్లస్ ప్యాడ్ గో 2 అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో IMAX సైజు విజువల్స్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఇందులో రేడియంట్ మరియు రేజర్ షార్ప్ విజువల్స్ చూడవచ్చని కూడా వన్ ప్లస్ చెబుతోంది. ఈ ప్యాడ్ 2.8K రిజల్యూషన్ కలిగిన బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ప్యాడ్ మంచి స్పీడ్ కలిగిన స్టైలో పెన్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
సౌండ్ పరంగా, ఈ అప్ కమింగ్ ప్యాడ్ క్వాడ్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఇది విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. వన్ ప్లస్ ప్యాడ్ గో 2 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ వన్ ప్లస్ ప్యాడ్ 8జీబీ ర్యామ్ మరియు 256 జీబీ బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా మరియు ముందు వీడియో కాలింగ్ కోసం సెల్ఫీ కలిగి ఉంటుంది.
వన్ ప్లస్ ప్యాడ్ గో 2 లాంచ్ కోసం వన్ ప్లస్ అందించిన టీజర్ పేజీ నుంచి కీలకమైన ఫీచర్స్ వరుసగా విడుదల చేస్తోంది. ఈ ప్యాడ్ మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలో అందిస్తుంది. ఈ ప్యాడ్ కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.