ఇక మొబైల్ ఫోన్స్ లో ఆ గవర్నమెంట్ Cyber Security App తప్పనిసరి.!

HIGHLIGHTS

యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది

Cyber Security App తప్పనిసరిగా ప్రీ ఇన్ స్టాల్ చేసి ఇవ్వాలని మొబైల్ తయారీ కంపెనీలకు ఆదేశం

యాప్ డిలీట్ చేసే అవకాశం లేకుండా చేయాలని చూడాలని కూడా ఆదేశించింది

ఇక మొబైల్ ఫోన్స్ లో ఆ గవర్నమెంట్ Cyber Security App తప్పనిసరి.!

దేశ ప్రజల మరియు మొబైల్ యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. SIM కార్డు తో బండిల్ చేసిన వాట్సాప్ లేదా మెసేజ్ యాప్ సర్వీస్ ను ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త రూల్ కూడా ప్రకటించింది. ఇక నుంచి కొత్త మొబైల్ ఫోన్స్ లో గవర్నమెంట్ అందించిన Cyber Security App తప్పనిసరిగా ప్రీ ఇన్ స్టాల్ గా అందించాలని మొబైల్ తయారీ కంపెనీలకు ఆదేశించింది. కేవలం ప్రీ ఇన్ స్టాల్ గా అందించడమే కాదు వాటిని డిలీట్ చేసే అవకాశం లేకుండా చేయాలని చూడాలని కూడా ఆదేశించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cyber Security App

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఒక నుంచి వచ్చే కొత్త మొబైల్ ఫోన్ లలో ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ కచ్చితంగా ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలని ఆదేశించింది. ఈ యాప్ ఎప్పటికీ డిలీట్ కాకుండా ఉండేలా ఇవ్వాలని కూడా ఆదేశించింది.

Cyber Security App

భారతదేశ టెలికాం శాఖ ఈ కొత్త ఆదేశం విడుదల చేసింది. ప్రభుత్వం అందించిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాప్ ‘Sanchar Saathi’ యాప్ కొత్త ఫోన్ లో ముందుగా ఇన్స్టాల్ చేసి రిలీజ్ చేయాలని తెలిపింది. ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి 90 రోజులు గడువు విధించింది. ఈ లోపు అన్ని మొబైల్ కంపెనీలు కూడా ఈ కొత్త ఆదేశాలు అమలు చేయాలి. కేవలం ఇది మాత్రమే కాదు మొబైల్ ఫోన్ అందుకునే సాఫ్ట్ వేర్ లేదా సెక్యూరిటీ అప్డేట్ తో ఈ యాప్ ని ప్రతి ఫోన్ ఉండేలా చూసుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది.

Also Read: BSNL ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ మళ్ళీ తిరిగొచ్చింది.!

ప్రభుత్వం Cyber Security App ఎందుకు తప్పనిసరి చేసింది?

ఈ యాప్ ఫోన్ లో ఖచ్చితం చేయడం ద్వారా టెలికామ్ సైబర్ భద్రత పెరుగుతుంది మరియు నెట్ వర్క్ ను తప్పుగా ఉపయోగించడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా IMEI చెక్ చేయడం మరియు ఫోన్ ట్రాక్ / బ్లాక్ చేయడం మరింత సులభం అవుతుంది. డూప్లికేట్ IMEI నెంబర్ల ద్వారా ఎక్కువగా స్కామ్ లేదా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ యాప్ తో ఎటువంటి తప్పు దారులు తొక్కకుండా ముందే IMEI ని లాక్ చేస్తుంది. ఈ యాప్ ఉండటం వలన చోరీ అయిన ఫోన్లు త్వరగా కనిపెట్టడానికి మరియు నెట్ వర్క్ మిస్ యూజ్ చేసే అవకాశం తగ్గుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile