VIVO T5e స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లాంచ్ చేసిన వివో.. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

వివో ఈరోజు VIVO T5e స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లాంచ్ చేసింది

8GB వరకు ర్యామ్ ఫీచర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ని టార్గెట్ చేసి లాంచ్ చేసింది

VIVO T5e స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లాంచ్ చేసిన వివో.. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

రెండు వారాల క్రితం ఇండియన్ మార్కెట్లో వివో టి సిరీస్ నుంచి వివో టి5 లైట్ ఫోన్ లాంచ్ చేసిన వివో, ఈరోజు VIVO T5e స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ని టార్గెట్ చేసి లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో కూడా బిగ్ బ్యాటరీ, మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ మరియు 8GB వరకు ర్యామ్ ఫీచర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VIVO T5e ప్రైస్

వివో ఈ ఫోన్ ను కేవలం రూ. 13,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏరో బ్లూ మరియు షాడో గ్రే రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ. 12,999 ధరలో లభిస్తుంది.

VIVO T5e ఫీచర్స్

వివో టి5e స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ HD రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ మరియు డ్యూరాబిలిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T7225 ఆక్టా కోర్ 4G చిప్ సెట్, 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16OS తో లాంచ్ అయ్యింది.

VIVO T5e Price and offers

ఈ స్మార్ట్ ఫోన్ 8MP రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ FHD వీడియో, వివో కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ Ai కెమెరా సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ కూడా ఏఐ క్రియేషన్, వివో డాక్ మాస్టర్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read : Monsoon: వర్షాకాలంలో ఫ్రిడ్జ్ కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఉత్తమ చిట్కాలు.!

బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ మరియు అధిక మన్నిక కలిగిన డ్యూరబుల్ ఫోన్ కోరుకునే వారి కోసం ఈ ఫోన్ తగిన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile