Nothing Phone (3a) Lite: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
నథింగ్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది
నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది
నథింగ్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది
Nothing Phone (3a) Lite: నథింగ్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 3a లైట్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మంచి డిస్ప్లే, గొప్ప కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ కలగలిసిన ప్యాకేజీ గా లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ నథింగ్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఏమిటో వివరంగా చూద్దాం.
SurveyNothing Phone (3a) Lite: ప్రైస్
నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో కేవలం రూ. 20,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను ఈ ధరలో అందించింది. ఈ ఫోన్ యొక్క 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై ICICI బ్యాంక్ అండ్ వన్ కార్డ్ క్రెడిట్ తో రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ లాంచ్ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.
Also Read: LG Dolby Atmos స్మార్ట్ టీవీ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రీజనబుల్ ధరలో లభిస్తుంది.!
Nothing Phone (3a) Lite : ఫీచర్స్
నథింగ్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 3000 నిట్స్ పిక్ బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ ర్యామ్ బూస్ట్ మరియు గరిష్టంగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ నథింగ్ OS 3.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల మేజర్ అప్డేట్ మరియు 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ కూడా అందుకుంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 4 cm మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 30FPS 4K వీడియో రికార్డింగ్ మరియు కెమెరా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ EIS యాంటీ షేక్ కెమెరా సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ మరియు పాండా గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది.