BOSE ఆడియో మరియు ఉఫర్ తో POCO F8 Ultra ఫోన్ లాంచ్ చేసిన పోకో.!

HIGHLIGHTS

POCO F8 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు గ్లోబల్ మార్కెట్ పోకో లాంచ్ చేసింది

పోకో ఈ ఫోన్ ను BOSE ఆడియో మరియు ఉఫర్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ గరిష్టంగా 30FPS 8K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది

BOSE ఆడియో మరియు ఉఫర్ తో POCO F8 Ultra ఫోన్ లాంచ్ చేసిన పోకో.!

POCO F8 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు గ్లోబల్ మార్కెట్ పోకో లాంచ్ చేసింది. షియోమీ ఉప బ్రాండ్ అయిన పోకో ఈ ఫోన్ ను BOSE ఆడియో మరియు ఉఫర్ తో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఇది మాత్రమే కాదు ప్రీమియం టెక్స్చర్ డిజైన్ మరియు 8 Elite Gen 5 వంటి మరిన్ని బారి ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO F8 Ultra : ఫీచర్స్

పోకో ఎఫ్ 8 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ ఐ-కేర్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 3500 పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, వెట్ టచ్ 2.0 సపోర్ట్, HDR10+ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 3nm మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కలిగిన Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ 16GB LPDDR5x ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ ఆఫర్ చేసింది.

ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ను 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో అందించింది. అలాగే, ముందు 32mp సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 30FPS 8K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, 60FPS వద్ద 4K వీడియో మరియు 1920FPS అల్ట్రా స్లో మోషన్ వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో పామ్ షట్టర్, వాయిస్ షట్టర్ మరియు సెల్ఫ్ టైమర్ వంటి ఫీచర్స్ కూడా అందించింది.

POCO F8 Ultra

ఈ ఫోన్ రెండు సిమెట్రికల్ స్టీరియో స్పీకర్ మరియు ఇండిపెండెంట్ ఉఫర్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Bose ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో, హై రిజల్యూషన్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ Hyper OS 3 తో లాంచ్ అయ్యింది.

ఈ పోకో కొత్త ఫోన్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 22.5W రివర్స్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Also Read: Tariff Hike 2025: బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంచిన Vi టెలికాం.. టారిఫ్ బాదుడు షురూ.!

POCO F8 Ultra : ప్రైస్ (గ్లోబల్)

పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను గ్లోబల మార్కెట్లో 679 డాలర్ల (సుమారు రూ. 60,589) బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo