Tariff Hike 2025: బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంచిన Vi టెలికాం.. టారిఫ్ బాదుడు షురూ.!
దేశంలో టెలికాం కంపెనీలు మరోసారి టారిఫ్ రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నాయి
ఈరోజు వోడాఫోన్ ఐడియా తన బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రేటు ను గుట్టు చప్పుడు కాకుండా పెంచేసింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముందు లభించిన రేటుతో పోలిస్తే ఒకేసారి రూ. 39 రూపాయలు పెరిగింది
Tariff Hike 2025: దేశంలో టెలికాం కంపెనీలు మరోసారి టారిఫ్ రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈరోజు వోడాఫోన్ ఐడియా తన బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రేటు ను గుట్టు చప్పుడు కాకుండా పెంచేసింది. 84 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే కాలింగ్ అండ్ SMS ప్రీపెయిడ్ ప్లాన్ రేటును ఈరోజు పెంచింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముందు లభించిన రేటుతో పోలిస్తే ఒకేసారి రూ. 39 రూపాయలు పెరిగింది. ఈ కొత్త అప్డేట్ చూస్తుంటే టారిఫ్ బాదుడు షురూ అయ్యిందని అనిపిస్తుంది.
SurveyTariff Hike 2025: ఏమిటా Vi ప్రీపెయిడ్ ప్లాన్?
వోడాఫోన్ ఐడియా యొక్క అన్లిమిటెడ్ కాలింగ్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 509 ను ఇప్పుడు పెంచేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ లో ఈ ప్లాన్ యొక్క కొత్త రేటును కూడా లిస్ట్ చేసింది. రూ. 509 స్థానంలో రూ. 548 ప్రీపెయిడ్ ప్లాన్ ను రీప్లేస్ చేసింది. అంటే, ఈ పాత ప్లాన్ రేటును ఏకంగా రూ. 39 రూపాయలు పెంచేసింది. ఇది 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు అందించే ప్లాన్. ఈ ప్లాన్ కోసం నిన్నటి వరకు రోజుకు రూ. 6.05 రూప్యాలు ఖర్చు చేయాల్సి వస్తే, ఇప్పుడు కొత్త రేటుతో రోజుకు రూ. 6.52 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
రూ. 509 ప్లాన్ vs రూ. 509 ప్లాన్ ప్రయోజనాలు
వోడాఫోన్ ఐడియా రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు సర్కిల్ ను బట్టి 6 జీబీ / 9 జీబీ హై స్పీడ్ డేటా అందించేది. అయితే, ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 548 రూపాయలకు పెరిగింది. ఈ ప్లాన్ కూడా 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, పెరిగిన రేటుతో పాటు 1 జీబీ హై స్పీడ్ డేటా కూడా జత చేసింది. అంటే, ఈ ప్లాన్ తో సర్కిల్ ను బట్టి 7 జీబీ / 10 జీబీ డేటా అందిస్తుంది.

పైన తెలిపిన బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కాకుండా వన్ ఇయర్ కాలింగ్ ప్లాన్ రేటును కూడా పెంచేసింది. 365 అన్లిమిటెడ్ కాలింగ్ తో వోడాఫోన్ ఐడియా అందించిన రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంచేసి ఇప్పుడు రూ. 2,249 చేసింది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పై ఏకంగా రూ. 250 రూపాయలు పెంచేసింది.
Also Read: iQOO 15 ఇండియా లాంచ్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
రూ. 2,249 ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది మరియు డైలీ 100 SMS ఆఫర్ చేస్తుంది. ముందు ఈ ప్లాన్ తో 24 జీబీ డేటా అందించేది. అయితే, ఇప్పుడు పెరిగిన రేటుతో 6 జీబీ పెంచి ఇప్పుడు 30 జీబీ హై స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది.
ఎప్పుడెప్పుడు టెలికాం టారిఫ్ పెంచుదామా అని చూస్తున్న జియో మరియు ఎయిర్టెల్ ఇప్పుడు ఇదే దారిలో టారిఫ్ రేట్లు పెంచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.