Realme GT 8 Pro : అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు తన అల్ట్రా ప్రీమియం Realme GT 8 Pro ను ఇండియాలో లాంచ్ చేసింది

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 తో చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన రెండో స్మార్ట్ ఫోన్ గా ఈ ఫోన్ వచ్చింది

ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

Realme GT 8 Pro : అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Realme GT 8 Pro : రియల్ మీ ఈరోజు తన అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 తో చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన రెండో స్మార్ట్ ఫోన్ గా ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ రియల్ మీ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme GT 8 Pro : ప్రైస్

రియల్ మీ GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో వచ్చింది. వీటిలో బేసిక్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 72,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ 16 జీబీ + 512 జీబీ హై ఎండ్ వేరియంట్ ను రూ. 79,999 ధరతో లాంచ్ చేసింది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డు రూ. 5,000 డిస్కౌంట్ మరియు GT యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి ఆఫర్స్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో కెమెరా స్విచ్ కవర్స్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీ అర్డ్సర్ ఈరోజు నుంచి ప్రారంభించింది. నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.

Realme GT 8 Pro : ఫీచర్స్

ఈ రియల్ మీ కొత్త ఫోన్ మాట్టే మెటల్ ఫ్రేమ్ కలిగిన సరికొత్త డిజైన్ మరియు వెనుక కెమెరా రూపం మార్చుకునే Switch Design తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.79 ఇంచ్ AMOELD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 2K (QHD+) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. రియల్ మీ ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. దీనికి జతగా 16 జీబీ LPDDR5x ఫిజికల్ ర్యామ్, 12GB డైనమిక్ ర్యామ్ మరియు 512 జీబీ స్టోరేజ్ తో అందించింది.

Realme GT 8 Pro Features

కెమెరా పరంగా ఈ ఫోన్ సూపర్ కెమెరా స్టెప్ కలిగి ఉంది. ఇందులో వెనుక 50MP Ricoh GR OIS ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా జతగా 200MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ ఫోన్ మెయిన్ కెమెరా 120FPS 4K డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ తో పాటు 30FPS 8K వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో 4K 120FPS ప్రొఫెషనల్ వీడియో మరియు సూపర్ క్లియర్ 120x జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై నెవర్ బిఫోర్ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

ఈ స్మార్ట్ ఫోన్ లో భారీ 7000 mAh బ్యాటరీ అందించింది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. గేమింగ్ కోసం ఈ ఫోన్ లో గేమింగ్ బూస్ట్ 3.0 సపోర్ట్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo