New Smart Watch Launched: ప్రముఖ గ్లోబల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాడ్ Promate ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. XWatch-B2 పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ డిస్ప్లే మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది. ప్రోమేట్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Promate New Smart Watch Launched:
ప్రోమేట్ సరికొత్తగా ఈరోజు విడుదల చేసిన XWatch-B2 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ ను Rs. 2499 ధరతో లాంచ్ చేసింది మరియు ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుండే అమేజాన్ ద్వారా సేల్ కి అందులోకి కూడా వచ్చింది. Buy From Here
ఈ ప్రోమేట్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ TFT HD (240×296) డిస్ప్లేని 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ మంచి డిజైన్ మరియు క్రిస్టల్ క్లియర్ డిస్ప్లేతో వచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ Blue, Black మరియు Graphite కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ వాచ్ Bluetooth 5.2 సపోర్ట్ తో మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో మంచి కాలింగ్ అవకాశం అందిస్తుంది.
ప్రోమేట్ స్మార్ట్ వాచ్
ఈ స్మార్ట్ వాచ్ సైకిలింగ్, రన్నింగ్ మరియు యోగా వంటి 123+ డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ లను కలిగి వుంది. యూజర్లు ఎప్పటి కప్పుడు కొత్త వాచ్ ఫేస్ లతో ఆకట్టుకునేలా చేసేందుకు వీలుగా ఈ స్మార్ట్ వాచ్ ను 200+ వాచ్ ఫేస్ లను కూడా ఉన్నట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ IP67 Water Proof తో వస్తుంది మరియు రియల్ టైమ్ హార్ట్ రేట్ మోనిటర్ కూడా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile