NoiseFit Vortex Plus: తక్కువ ధరకే AMOLED స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తున్న నోయిస్.!

HIGHLIGHTS

Noise బ్రాండ్ తక్కువ ధరకే AMOLED స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తోంది

లాంచ్ ఆఫర్ ధర వివరాలను సైతం వెల్లడిస్తూ నోయిస్ టీజింగ్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను జనవరి 31వ తేదిన లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

NoiseFit Vortex Plus: తక్కువ ధరకే AMOLED స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తున్న నోయిస్.!

NoiseFit Vortex Plus: తక్కువ ధరకే AMOLED స్మార్ట్ వాచ్ లాంచ్ చేయనున్నట్లు ప్రముఖ ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోయిస్ టీజింగ్ మొదలు పెట్టింది. వర్టెక్స్ ప్లస్ పేరుతో ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను జనవరి 31వ తేది భారత మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం లాంచ్ డేట్ ను మాత్రామే కాకుండా ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ కీలకమైన స్పెక్స్ మరియు లాంచ్ ఆఫర్ ధర వివరాలను సైతం వెల్లడిస్తూ టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

NoiseFit Vortex Plus with AMOLED Display

నోయిస్ ఫిట్ వర్టెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను MRP: Rs. 6,999 ధరతో సూచించినా ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 1,999 లాంచ్ ఆఫర్ ధరతో లాంఛ్ చేయబోతున్నట్లు నోయిస్ అధికారిక వెబ్సైట్ నుండి అందించిన టీజింగ్ పేజ్ ద్వారా ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ ను ముందుగా కొనుగోలు చేసే 1,000 యూజర్లకు ఎక్స్ క్లూజివ్ గా ఈ ఆఫర్ ధర వర్తిస్తుందని తెలిపింది. అయితే,ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంత ఉంటుందో లాంచ్ రోజు తెలియచేస్తుందని తెలిపింది.

Also Read : Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ.!

నోయిస్ ఫిట్ వర్టెక్స్ ప్లస్ టీజ్డ్ స్పెక్స్

నోయిస్ ఫిట్ వర్టెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ తెలిపింది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ లో 7 రోజులు బ్యాకప్ అందించ గల బ్యాటరీ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ అప్ కమింగ్ నోయిస్ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్, మెష్ మెటల్, లెధర్ మరియు లైఫ్ స్టైల్ స్ట్రాప్స్ ఆప్షన్ లలో కూడా లభిస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ నోయిస్ హెల్త్ సూట్ సపోర్ట్ తో 24×7 హార్ట్ రేట్, బ్రీత్ ప్రాక్టీస్, ఫీమేల్ సైకిల్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, SpO2 ట్రాకింగ్ మరియు స్ట్రెస్ మేజర్మెంట్స్ వంటి వాటికి సపోర్ట్ లను కలిగి వుంది. వర్టెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ 100+ వాచ్ ఫేస్ లతో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo