CMF Watch Pro 2: మీ స్మార్ట్ వాచ్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోండి అనే రీతిలో వచ్చింది.!

HIGHLIGHTS

CMF Watch Pro 2 స్మార్ట్ వాచ్ ను కంపెనీ విడుదల చేసింది

ఈ స్మార్ట్ వాచ్ కొత్త అంచులు మార్చుకునే ఫీచర్ తో వచ్చింది

ఈ స్మార్ట్ వాచ్ మంచి డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో ఆకట్టుకుంటోంది

CMF Watch Pro 2: మీ స్మార్ట్ వాచ్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోండి అనే రీతిలో వచ్చింది.!

CMF Watch Pro 2: మీ స్మార్ట్ వాచ్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోండి అనే రీతిలో వచ్చింది. స్మార్ట్ వాచ్ లు రావడం మొదలైన నాటి నుండి చాలా మార్పులు స్మార్ట్ వాచ్ విభాగంలో చోటు చేసుకున్నాయి. ఇదే దారిలో నథింగ్ సబ్ బ్రాండ్ తెచ్చిన కొత్త స్మార్ట్ వాచ్ డిఫరెంట్ ఫీచర్ తో వచ్చింది. డిస్ప్లే బెజల్స్ (అంచులు) నచ్చినట్లు మార్చుకునేలా కొత్త ఫీచర్ తో ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Watch Pro 2: ఫీచర్లు

CMF సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ మంచి డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో ఆకట్టుకుంటోంది. ఈ వాచ్ 1.32 ఇంచ్ రౌండ్ AMOLED డిస్ప్లే కలిగి వుంది. ఇది అల్యూమినియం బాడీ తో మరియు మార్చుకోగలిగే బెజెల్స్ (అంచులు) ఫీచర్ తో వస్తుంది. అంటే, ఈ వాచ్ డిస్ప్లే పై ఉండే రౌండ్ గా ఉండే అంచు ఫ్రేమ్ ను నచ్చినట్లు మార్చుకోవచ్చన్న మాట.

CMF Watch Pro 2
CMF Watch Pro 2

ఈ స్మార్ట్ వాచ్ లో బిల్ట్ ఇన్ మల్టీ సిస్టం GPS వుంది మరియు జెశ్చర్ కంట్రోల్ సపోర్ట్ తో వస్తుంది. ఈ వాచ్ ప్రో 2 స్మార్ట్ వాచ్ లో ఫంక్షనల్ క్రౌన్ కూడా వుంది. ఈ స్మార్ట్ వాచ్ 100+ సిగ్నేచర్ వాచ్ ఫేసెస్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, ఈ వాచ్ లో 120 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ కూడా వస్తుంది.

సిఎంఎఫ్ వాచ్ ప్రో 2 స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్, స్లీప్, స్ట్రెస్ మరియు SpO2 మోనిటర్స్ తో వస్తుంది. ఈ వాచ్ లో AI నోయిస్ రిడక్షన్ సపోర్ట్ కలిగిన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఉంటుంది. ఈ వాచ్ 11 రోజులు పనిచేయగల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.

Also Read: OnePlus Nord 4: లీకైన వన్ ప్లస్ నార్డ్ 4 ప్రైస్.. నార్డ్ 3 కంటే చవక ధరకే వస్తోందా.!

CMF Watch Pro 2: ప్రైస్

సిఎంఎఫ్ వాచ్ ప్రో 2 స్మార్ట్ వాచ్ ను రూ. 4,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ని Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo