CMF Watch 3 Pro: నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

Nothing ఉప బ్రాండ్ అయిన CMF అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ లాంచ్ అనౌన్స్ చేసింది

CMF Watch 3 Pro వాచ్ ను న్యూ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది

సిఎంఎఫ్ ద్వారా అందించే ప్రోడక్ట్స్ బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటాయి

CMF Watch 3 Pro: ప్రముఖ యూకే ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Nothing ఉప బ్రాండ్ అయిన CMF అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే సిఎంఎఫ్ వాచ్ 3 ప్రో స్మార్ట్ వాచ్ మరియు వాచ్ ను న్యూ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నథింగ్ తో పోలిస్తే సిఎంఎఫ్ ద్వారా అందించే ప్రోడక్ట్స్ బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

CMF Watch 3 Pro: లాంచ్ డేట్

సిఎంఎఫ్ వాచ్ 3 ప్రో స్మార్ట్ వాచ్ ఇండియా లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ఈ నెల చివరి నాటికి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వాచ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ స్మార్ట్ వాచ్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది.

CMF Watch 3 Pro: ఫీచర్స్

సిఎంఎఫ్ వాచ్ 3 ప్రో స్మార్ట్ వాచ్ మంచి అందమైన రౌండ్ డయల్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ మెటల్ ఫ్రేమ్ తో ఉంటుంది మరియు సిలికాన్ స్ట్రాప్స్ తో వస్తుంది. ఈ వాచ్ 60FPS రిఫ్రెష్ రేట్ కలిగిన 1.43 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఆటో బ్రైట్నెస్ మరియు 91% స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి ఉంటుంది. ఈ వాచ్ 120 కస్టమ్ మరియు ఇంటరాక్టివ్ వాచ్ ఫేసెస్ సపోర్ట్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ కొత్త కస్టమ్ వర్క్ అవుట్ సమరీ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇది యూజర్ కోరుకునే వివరాలు సమరైజ్ చేసి అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ హెల్త్ సపోర్ట్ కోసం అడ్వాన్స్డ్ హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మరియు స్ట్రెస్ లెవల్ వంటి మరిన్ని హెల్త్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 131 స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉంటుంది.

Also Read: SASA LELE Sale బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన Flipkart

ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ వాచ్ AI న్యూస్ రిపోర్టర్ మరియు AI రికార్డింగ్ ట్రాన్స్ స్క్రిప్షన్ వంటి ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు నథింగ్ X యాప్ తో నడుస్తుంది. అంతేకాదు, GPS ట్రాకింగ్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :