MIVI One 5G tap features know one day before launch
MIVI One 5G: హైదరాబాద్ బేస్డ్ వేరబుల్ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ మివి ఫస్ట్ మొబైల్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది. ఈ ఫోన్ ను చాలా రోజులుగా టీజింగ్ చేస్తోంది. ఈ మివి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు మివి తెలిపింది. కేవలం కంపెనీ చెప్పడం మాత్రమే కాదు ఈ ఫోన్ చూసిన వారికి ఎవరికైనా ఇది ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో రాబోతున్నట్లు అర్థమవుతుంది.
మివి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని రేపు అనగా, సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ముందు నుంచి టైం అనౌన్స్ చేసింది. మివి కూడా తన ఫోన్ లాంచ్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా అనౌన్స్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది.
మివి ఈ ఫోన్ ను స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో పరిచయం చేస్తోంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ పూర్తిగా అర్థం అవుతుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ Snapdragon 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ పేరు ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఇది 4nm టెక్నాలజీ చిప్ సెట్ అని మాత్రం తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ప్యూర్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 128GB బిగ్ స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది.
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా తో లాంచ్ అవుతుంది. ఇది లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు కంపెనీ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందిస్తుంది.
Also Read: Redmi Note 17 Pro Max ఫస్ట్ డే సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి .. సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!
కంపెనీ తెలిపిన ప్రకారం, మివి ఈ ఫోన్ ను 5 కొత్త రంగుల్లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఈ పూర్తి ఫీచర్స్ మనకు క్లియర్ గా తెలుస్తాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో నడుస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రైస్ హైక్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ప్రైస్ ని సెట్ చేస్తే ఈ ఫోన్ పై యూజర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.