DoT News: తప్పుడు సిమ్ కార్డు ఉంటే 50 లక్షల జరిమానా .. మీ పేరుతో ఫేక్ సిమ్ ఉందో లేదో ఇలా చెక్ చేయండి.!

HIGHLIGHTS

తప్పుడు సిమ్ కార్డు మరియు IMEI టాంపరింగ్ అరికట్టడానికి DoT కొత్త శిక్షలు అమలు

ఇలాంటి వారికి మూడు సంవత్సరాల కట్టిన కారాగార శిక్ష

50 లక్షల వరకు భారీ జరిమానా వంటి శిక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది

DoT News: తప్పుడు సిమ్ కార్డు మరియు IMEI టాంపరింగ్ వంటి మోసపూరితమైన పనులు అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) కొత్త శిక్షలు అమలు చేస్తోంది. దేశంలో ఎవరైనా ఫేక్ సిమ్ కార్డు కలిగి ఉన్నా, లేక ఐఎంఈఐ ట్యాంపరింగ్ వంటి చర్యలకు పాల్పడిన వారికి చాలా కఠిన శిక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇలాంటి వారికి మూడు సంవత్సరాల కట్టిన కారాగార శిక్షతో పాటు 50 లక్షల వరకు భారీ జరిమానా వంటి శిక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది. అందుకే, ప్రతి ఒక్కరు కూడా వారి పేరు మీద ఏదైనా ఫేక్ సిం కార్డు ఉందొ లేదో రెగ్యులర్ గా చెక్ చేయడం చాలా అవసరం. మీ పేరుతో ఫేక్ సిమ్ ఉందో లేదో ఎల్ చేయ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి.

సిమ్ కార్డు వివరాలు తెలుసుకోవడానికి ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రత్యేకమైన పోర్టల్ ను అందించింది. ఈ ప్రత్యేకమైన పోర్టల్ లో జస్ట్ వన్ మినిట్ లో మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డు వివరాలు తెలుసుకోవచ్చు. దీనికోసం Sanchar Saathi TAFCOP పోర్ట్ ఉపయోగించి మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీ ఫోన్ ఐఎంఈఐ వివరాల ఏమైనా టాంపరింగ్ అయ్యాయా అని కూడా మీరు తెలుసుకోవచ్చు. కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు ఇదే పోర్టల్ నుంచి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయొచ్చు.

పేరు మీద ఉన్న ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా చెక్ చేయాలి?

  • మొదటగా tafcop.sancharsaathi.gov.in సైట్ ఓపెన్ చేయండి
  • ఈ సైట్ మెయిన్ పేజీ లో సూచించిన వద్ద మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
  • క్రింద ఉన్న మరియు సూచించిన బాక్స్ లో CAPTCHA code ను నమోదు చేయండి
  • ఈ వివరాలు అందించిన తర్వాత OTP కోసం రిక్వెస్ట్ చేయండి
  • మీ ఫోన్ లో అందుకున్న OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

ఈ పోర్టల్ లో మీ పేరు మీద తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్ వివరాలు అందిస్తుంది. ఇక్కడ ఉన్న లిస్ట్ లో మీరు తీసుకొని లేదా మీరు ఉపయోగించని మొబైల్ నెంబర్ లేదా సిమ్ కార్డు ఉన్నట్లయితే, మీరు వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఇలా చేయడం వలన మీ పేరు మీద సిమ్ కార్డు ఉపయోగించే వారిని కనిపెట్టి శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Also Read: Xiaomi 18 Pro Max లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ .. కళ్ళు చెదిరే డిజైన్ తో వస్తోంది.!

IMEI ఎలా చెక్ చేయాలి?

  • దీనికోసం ముందుగా ceir.sancharsaathi.gov.in పోర్టల్ ఓపెన్ చేయండి
  • ఇక్కడ మెయిన్ పేజీ లో ఐఎంఈఐ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి
  • ఇక్కడ వచ్చిన కొత్త పేజీ లో క్యాప్చా మరియు మొబైల్ నంబర్ నమోదు చేయండి
  • OTP కోసం రిక్వెస్ట్ చేయండి మరియు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి
  • చివరిగా అడుగున ఉన్న సబ్మిట్ బటన్ నొక్కి పూర్తి చేయండి

ఇక్కడ మీ ఫోన్ ఐఎంఈఐ కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. మీరు మీ వివరాలు వెరిఫై చేసి మీ సిమ్ కార్డు మరియు ఫోన్ ను మీరు జాగ్రత్త చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :