Oppo K14 Plus launch date announced know the feature
Oppo K14 Plus ఇండియా లాంచ్ డేట్ ని ఒప్పో ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అదిరే ఫీచర్స్ తో లాంచ్ కి సిద్ధం చేస్తోంది. ఈ ఫోన్ టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్ తో మార్కెట్ లో ఆసక్తి రేపిన ఒప్పో, ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్స్ తో మార్కెట్ లో హాట్ టాపిక్ గా నిలిచేలా ఉంది.
ఒప్పో కె14 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గల సమయంలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో డేట్ అండ్ టైం రివీల్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ రిలీజ్ చేసింది.
ఒప్పో కె 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను డ్యామేజ్ ప్రూఫ్ మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ మీడియాటెక్ Dimensity 7360 Max చిప్ సెట్ తో అందిస్తుంది. ఇది 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే లేటెస్ట్ మీడియాటెక్ చిప్ సెట్. ఇందులో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 8GB అదనపు ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ ను పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వివరాలతో అందించింది.
ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ని అందిస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను నిరంతరం కూల్ గా ఉంచడానికి పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ని కూడా జత చేసింది.
Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై సేల్ కంటే ముందే భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన సెన్సార్ జత 2MP బొకే కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP Sony IMX 480 సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్, వివో లేటెస్ట్ ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 8000 mAh హెవీ కెమెరాతో లాంచ్ చేస్తోంది. ఇందులో 45W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ స్టీరియో స్పీకర్ మరియు 300% అల్ట్రా వాల్యూమ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.