Xiaomi S Mini LED: క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో కొత్త టీవీలు లాంచ్ చేస్తోంది.!

HIGHLIGHTS

షియోమీ ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్ నుండి కొత్త టీవీల లాంచ్ అనౌన్స్ చేసింది.

Xiaomi S Mini LED టీవీలు క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో లాంచ్ అవుతాయి

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను అమెజాన్ ఇండియా ద్వారా షియోమీ టీజింగ్ చేసింది

Xiaomi S Mini LED: క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో కొత్త టీవీలు లాంచ్ చేస్తోంది.!

Xiaomi S Mini LED: షియోమీ ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్ నుండి కొత్త టీవీలు లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు క్వాంటం MagiQ డిస్ప్లే టెక్నాలజీతో లాంచ్ అవుతాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను అమెజాన్ ఇండియా ద్వారా షియోమీ టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ టీవీల ప్రత్యేకతలు తెలిపే కొని డీటెయిల్స్ కూడా టీజర్ పేజీ నుంచి అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi S Mini LED: లాంచ్ డేట్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను ఏప్రిల్ 15వ తేదీ ఇండియన్ మార్కెట్లో పరిచయం చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు రివీల్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని వివరాలు కూడా ఇదే నుంచి పేజీ వెల్లడించింది.

Xiaomi S Mini LED: ఫీచర్స్

షియోమీ లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ టీవీలు మినీ ఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంటాయి. అంటే, సాధారణ టీవీలలో ఉండే ఎల్ఈడి లైట్స్ కంటే కూడా మరింత చిన్నవైన ఎల్ఈడి లైట్లు కలిగి ఉంటాయి. ఈ సెట్ అప్ ద్వారా ఈ టీవీ సాధారణ ఎల్ఈడి మరియు క్యూలెడ్ టీవీల కంటే కూడా మరింత స్ఫుటమైన మరియు డీప్ కలర్స్ అండ్ బ్లాక్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది.

Xiaomi S Mini LED

అదనంగా, ఈ స్మార్ట్ టీవీలు పగటిపూట కూడా స్పష్టంగా చూడగలిగేంత బ్రైట్నెస్ తో ఉంటాయని టీజర్ లో తెలిపింది. ఈ టీవీలు కలిగిన ఎల్ఈడి కంట్రోల్ చేసే గొప్ప ప్రోసెసర్ తో తగిన బ్రైట్నెస్ మరియు డీప్ బ్లాక్స్ ఈ టీవీలలో చూడొచ్చని కూడా షియోమీ పేర్కొంది. సరైన స్థానంలో ఉంచిన వేలకొద్దీ మినీ ఎల్ఈడి లైట్లను మంచి బ్రిలియన్స్ తో నడిపించే షియోమీ నెక్స్ట్ జనరేషన్ డిస్ప్లే టెక్నాలజీ Quantum MagiQ తో వస్తుంది.

Also Read: Realme Buds T500 Pro స్టైలిష్ లుక్ అండ్ LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.!

కేవలం డిస్ప్లే విజువల్స్ మాత్రమే కాదు ఈ విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ తో కూడా ఈ టీవీ సిరీస్ ఉంటుందని షియోమీ తెలిపింది. ఈ టీవీలు బెజెల్ లెస్ స్క్రీన్ తో చాలా అందమైన డిజైన్ తో కోడోత్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ టీవీలు లేటెస్ట్ టెక్నాలజీ డిస్ప్లే మరియు గొప్ప సౌండ్ అందించే సౌండ్ ఫీచర్స్ తో లాంచ్ అవుతాయని మనం భావించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo