xiaomi launched new S Mini LED Smart Tv in India know the price and features
Xiaomi S Mini LED సిరీస్ నుండి కొత్త Smart Tv లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీని గొప్ప బ్రైట్నెస్ మరియు గరిష్టంగా 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఇందులో డిస్ప్లే తో పాటు సౌండ్ కోసం కూడా మంచి సెటప్ అందించింది. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
షియోమీ ఈ స్మార్ట్ టీవీని మొత్తం మూడు సైజుల్లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు లిస్ట్ ఇక్కడ అందించాము.
ఈ మూడు స్మార్ట్ టీవీలు అమెజాన్ మరియు కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి లిస్ట్ చేసింది. అయితే, ప్రస్తుతం ముందస్తు బుకింగ్ కోసం మాత్రమే ఈ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీలు సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. కేవలం స్క్రీన్ సైజులో మాత్రమే మార్పులు కలిగి ఉంటాయి. ఈ టీవీలు ప్రీమియం మెటాలిక్ ఫినిష్ డిజైన్ తో ఆకట్టుకుంటాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలు మినీ LED ప్రెసిషన్ క్వాంటం డాట్ టెక్నాలజీ స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ టీవీ డిస్ప్లేలు గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ తో ఆకట్టుకునే రంగులు మరియు గొప్ప బ్రైట్నెస్ అందిస్తాయి.
ఈ టీవీలు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz (DLG 120 Hz) రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10+, HLG మరియు AI పిక్చర్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీలు క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి టోటల్ 34W సౌండ్ ఆఫర్ చేస్తాయి. ఈ టీవీలు డాల్బీ ఆడియో, DTS – X మరియు DTS Virtual : X సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. అయితే, ఈ టీవీలు eARC (Dolby Atmos Pass-through) సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇందులో 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టవిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.