భారీ డిస్కౌంట్ తో 50 ఇంచ్ 4K Smart Tv ని కేవలం 21 వేల బడ్జెట్ లోనే అందుకోండి.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 50 ఇంచ్ 4K Smart Tv ని కేవలం 21 వేల బడ్జెట్ లోనే అందుకోండి

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో లేటెస్ట్ అండ్ బెస్ట్ స్మార్ట్ టీవీలు సైతం మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి

పెద్ద స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి తగిన ఆప్షన్ గా ఉంటుంది

భారీ డిస్కౌంట్ తో 50 ఇంచ్ 4K Smart Tv ని కేవలం 21 వేల బడ్జెట్ లోనే అందుకోండి, అంటోంది ఫ్లిప్ కార్ట్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో లేటెస్ట్ అండ్ బెస్ట్ స్మార్ట్ టీవీలు సైతం మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో, ఒక బెస్ట్ డీల్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ డీల్ 21 వేల రూపాయల బడ్జెట్లో మంచి ఫీచర్స్ కలిగిన పెద్ద స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి తగిన ఆప్షన్ గా ఉంటుంది.

ఏమిటా 50 ఇంచ్ 4K Smart Tv డీల్?

ఇక ఈ రోజు ఫ్లిప్కార్ట్ అందించిన 50 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, Realme TechLife రీసెంట్ అందించిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 50UHDGDRWSDB పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 59% బిగ్ డీల్ అందించి రూ. 22,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ ధరతో పోలిస్తే ఈ రోజు చాలా చవక ధరలో లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ధరలో ఈ టీవీ మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: బిగ్ డీల్: 40 ఇంచ్ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

Realme TechLife (50) 4K Smart Tv : ఫీచర్స్

ఈ టీవీ 50 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG ఫీచర్స్ తో వస్తుంది 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ MEMC టెక్నాలజీతో ల్యాగ్ ఫ్రీ మరియు అల్ట్రా స్మూత్ విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ రియల్ మీ టెక్ లైఫ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ టీవీ 7 సౌండ్ మోడ్స్ మరియు AI సౌండ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ టీవీ టోటల్ 30W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :