కేవలం 17 వేల ధరలో 43 ఇంచ్ 4K QLED Smart tv కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి.!
కేవలం 17 వేల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ QLED 4K Smart tv
ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే మార్కెట్ లో లాంచ్ అయ్యింది
ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది
కేవలం 17 వేల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ 4K QLED Smart tv కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి. ఈరోజు బెస్ట్ స్మార్ట్ డీల్ అందుబాటులో వుంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థాంసన్ మరియు జియో జతగా అందించిన Thomson Jio TV ఈరోజు మంచి ఆఫర్స్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే మార్కెట్ లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.
Surveyబడ్జెట్ 43 ఇంచ్ 4K QLED Smart tv ఆఫర్
థాంసన్ మరియు జియో జతగా థాంసన్ జియో స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43TJQ0012 ను అందించాయి. ఈ టీవీని ఇండియన్ మార్కెట్ లో కేవలం రూ. 18,999 రూపాయల అతి చవక ధరకు అందించాయి. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ పై మరింత డిస్కౌంట్ అందుకునే మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది.
ఈ థాంసన్ జియో 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు.
Also Read: ఇంటిని షేక్ చేసే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Thomson Jio 43 ఇంచ్ 4K Smart tv : ఫీచర్స్
ఈ థాంసన్ జియో స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Jio Tele OS పై నడుస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ARM Cortex A53 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB + 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Digital Plus మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, బ్లూటూత్, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile