Samsung 43 ఇంచ్ 4K Smart Tv అమెజాన్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
Samsung 43 ఇంచ్ 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది
డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ సాంసంగ్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో లభిస్తుంది
యూజర్లు ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పరిశీలించవచ్చు
Samsung 43 ఇంచ్ 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ సాంసంగ్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలని మార్కెట్లో వెతుకుతున్న యూజర్లు ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పరిశీలించవచ్చు.
SurveySamsung 43 ఇంచ్ 4K Smart Tv : డీల్
ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ క్రిస్టల్ 4K విస్తా ప్రో సిరీస్ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్స్ అందించింది. ఈ టీవీ రీసెంట్ గా కూడా రూ. 30,990 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీని ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 27,490 రూపాయల ఆఫర్ ధరతో అమెజాన్ సేల్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 900 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,590 రూపాయల చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: OnePlus Shutting Down: వన్ ప్లస్ కంపెనీ బంద్ పై జోరుగా నడుస్తున్న న్యూస్.. నిజం ఏమిటంటే.!
Samsung 43 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్
సాంసంగ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచెస్ పరిమాణం కలిగిన ఎల్ఈడి ప్యానల్ తో వస్తుంది. ఇది 4K UHD రిజల్యూషన్ (3840 x 2160) మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్మార్ట్ టీవీల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా తయారు చేసిన Crystal Processor 4K తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కలిగిన అదనపు విజువల్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ HDR10+, 4K అప్ స్కేలింగ్, మెగా కాంట్రాస్ట్ మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ స్లిమ్ లుక్ డిజైన్ తో వస్తుంది.
ఈ శాంసంగ్ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ రెండు స్పీకర్లతో 20W సౌండ్ అందిస్తుంది. ఇందులో, Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ వంటి ఫీచర్స్ ఉండటం వలన మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీలో 3 HDMI, 1 USB-A పోర్ట్, ఈథర్నెట్ LAN పోర్ట్, RF, AV ఇన్, ఆప్టికల్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile