REALME స్మార్ట్ టీవీల మొదటి సేల్
ఈ టీవీలు రేపు మొదటిసారిగా సేల్ కానున్నాయి.
రియల్మి టీవీ రెండు సైజుల్లో వస్తుంది
ఈ రెండు టీవీలు HDR కి మద్దతు ఇస్తాయి
మీరు కనుక రియల్మి ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఈ టీవీ యొక్క రెండు వేరియంట్స్ కూడా జూన్ 2 వ తేదికి, అంటే రేపు మొదటిసారిగా సేల్ కానున్నాయి. 32 అంగుళాల రియల్‌మే టీవీ ధర రూ .12,999 కాగా, 43 అంగుళాల టీవీ దీని ధర రూ .21,999 గా ఉంది. ఈ రియల్మి స్మార్ట్ టీవీ Flipkart మరియు realme.com లో లభిస్తుంది. ఈ టీవీ యొక్క 32-అంగుళాల వేరియంట్ ఒక HD రెడీ టీవీ, అయితే 43-అంగుళాల టీవీ మాత్రం FHD టీవీ. ఈ రెండు టీవీలు HDR కి మద్దతు ఇస్తాయి మరియు Android TV OS తో పనిచేస్తాయి. ఈ టీవీలు గూగుల్ అసిస్టెంట్-ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు OTT ప్లాట్‌ఫారమ్స్ కు మద్దతు ఇస్తుంది.
SurveyRealme TV : ఫీచర్లు మరియు ధర
రియల్మి టీవీ రెండు సైజుల్లో వస్తుంది అవి : HD-Ready 32-ఇంచ్ మరియు 43-ఇంచ్ FHD మరియు 178-డిగ్రీల వ్యూ ఇంగ్ కోణాన్ని అందిస్తుంది. ఈ టెలివిజన్లలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్ తీసుకొస్తుంది.
ఈ టెలివిజన్లు 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీడియాటెక్ MSD 6683 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. ఇవి క్వాడ్-కోర్ ప్రాసెసర్ HDR10 డీకోడింగ్ మరియు HLG ప్రమాణాలకు మద్దతు అందిస్థాయి.
ఈ రియల్మి టీవీలో నాలుగు స్పీకర్లు ఉన్నాయి, ఇవి 24W స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి మరియు మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio తో ట్యూన్ చేయబడతాయి. ఈ రెండు టీవీలు 5,000 కి పైగా Apps, గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ మద్దతు కలిగి ఆండ్రాయిడ్ టీవీలను ధృవీకరించాయి. ఈ టీవీలలో Netflix, Amazon Prime వీడియో మరియు మరెన్నో యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.
ఈ రియల్మి టీవీలు Wi-Fi , బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు SPDD ఇన్పుట్, ఈథర్నెట్ పోర్ట్ మరియు మరెన్నో కనెక్టివిటీలను కలిగి ఉంటుంది .
ఈ టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో మరియు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్లతో ఎర్గోనామిక్ ఫిట్ కోసం నిర్మించిన ప్లాస్టిక్ మరియు కర్వ్ డిజైన్ ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile