కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

అతి తక్కువ ధరలో 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం

ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ వివరాలు ఏమిటో క్లియర్ గా తెలుసుకోండి

అతి తక్కువ ధరలో 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు మీ కోసం ఒక సరికొత్త స్మార్ట్ టీవీ ఆఫర్ ని తీసుకొచ్చాము. కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం ఈరోజు మీకు అందుబాటులో ఉంది. ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ వివరాలు ఏమిటో క్లియర్ గా తెలుసుకోండి.

QLED Smart Tv : ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?

ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఈరోజు మీకు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. అదేమిటంటే, realme TechLife 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ (55UHDWQRALLQ) ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకునే వారికి డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ 55 ఇంచ్ రియల్ మీ టెక్ లైఫ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో ఈరోజు మీకు లభిస్తుంది. . ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈటీవీ ఈరోజు బెస్ట్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: OnePlus Nord Buds 4 Pro: ప్రో లెవల్ ANC మరియు మంచి స్పీకర్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్

ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈటీవీ 4K UHD మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ కూడా అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 1 జీబీ ర్యామ్ అండ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ థింక్ AI వాయిస్ అసిస్టెంట్ మరియు మ్యాజిక్ రిమోట్ తో కూడా వస్తుంది.

ఈ 55 ఇంచ్ టీవీ రెండు స్పీకర్లు కలిగి 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 6 పిక్చర్ మోడ్స్ మరియు 5 సౌండ్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, AV, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

ఈ రియల్ మీ టెక్ లైఫ్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :