రూ.2,500 డిస్కౌంట్ అఫర్ తో Oneplus Y1S Pro స్మార్ట్ టీవీ సేల్..!!
Oneplus లేటెస్ట్ స్మార్ట్ టీవీ Oneplus Y1S Pro మంచి అఫర్ తో లభిస్తోంది
HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్
Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్
Oneplus లేటెస్ట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ Oneplus Y1S Pro మంచి అఫర్ తో లభిస్తోంది. ఇటీవల విడుదలయ్యి ఏప్రిల్ 11 నుండి అమ్మకానికి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన మంచి అఫర్ ని ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే ఇండియన్ మరెక్ట్లో ప్రవేశపెట్టబడింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ కొత్త బోర్డెర్ లెస్ డిజైన్, Dolby Audio మరియు HDR 10+ వంటి భారీ ఫీచర్లను కలిగివుంటుంది.
SurveyOneplus Y1S Pro: ధర మరియు ఆఫర్లు
Oneplus Y1S Pro 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ రూ.29,999 ధరలతో వచ్చింది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఏప్రిల్ 11 నుండి ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. Amazon తో పాటుగా OnePlus.in, Croma, Jio Digital, Reliance Digital మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది.
Oneplus Y1S Pro: ఫీచర్లు
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile