Oneplus బ్రాండ్ నుండి వస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ..!!

HIGHLIGHTS

వన్ ప్లస్ నుండి వస్తున్న మరొక కొత్త స్మార్ట్ టీవీ

Oneplus TV Y1S Pro పేరుతో టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది

43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

Oneplus బ్రాండ్ నుండి వస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ..!!

వన్ ప్లస్ మరొక కొత్త స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇటివల,  Y సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించిన వన్ ప్లస్ ఇప్పుడు అదే సిరీస్ నుండి మరొక స్మార్ట్ టీవీ ని తీసుకువస్తోంది. ఈ స్మార్ట్ టీవీని 43 Y1S Pro పేరుతో తీసుకువస్తున్నట్లు టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీని 43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ప్రత్యేకంగా వస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ టీవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు మాత్రం టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క రెండు ఫీచర్లను ఇప్పటికే వెల్లడించింది. ఈ టీవీని HDR 10 డీకోడింగ్ మరియు అతి సన్నని అంచులతో తీసుకువస్తున్నట్లు తెలిపింది.

ఇక ఇటివల ఇండియాలో విడుదల చేసిన Oneplus TV Y1S సిరీస్ నుండి వచ్చిన 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజులో వచ్చిన స్మార్ట్ టీవీల గురించి ఈ క్రింద చూడవచ్చు. 

Oneplus TV Y1S: ఫీచర్లు

ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S  ఫీచర్ల విషయానికి వస్తే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (1920×1080) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి.

ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc)  మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo