Smart TV: మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఇది టీవీ కాదు.. అంతకు మించి…!

HIGHLIGHTS

Mi TV 6 Extreme టీవీ కన్నా మించిన ఫీచర్లతో వచ్చింది

ఇంటిని షేక్ చేయగల 100 W సౌండ్ అవుట్ పుట్

డ్యూయల్ కెమెరా సిస్టమ్

Smart TV: మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఇది టీవీ కాదు.. అంతకు మించి…!

ఇటీవల షియోమి చైనాలో ప్రకటించిన Mi TV 6 Extreme టీవీ, ఒక టీవీ కన్నా మించిన ఫీచర్లతో వచ్చింది. ఈ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ మీ ఇంటిని షేక్ చేయగల 100 W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు లేటెస్ట్ టెక్నాలజీ ప్రాసెసర్  మరియు డిస్ప్లే తో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా డ్యూయల్ కెమెరా సిస్టమ్ ను కలిగివుంది. ఈ టీవీ 48MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్: ఫీచర్లు

లేటెస్ట్ గా చైనాలో విడుదలైన ఈ షియోమి స్మార్ట్ టీవీ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ అమోఘమైన ఫీచర్లతో వచ్చింది. మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ QHD రిజల్యూషన్ తో వుంటుంది. అంతేకాదు, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K డిస్ప్లే ని కలిగి ఉంటుంది.  ఈ షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ 4.5 GB ర్యామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి మీడియా టెక్ 8KTV పవర్ ఫుల్ ప్రొసెసర్ తో వస్తుంది.            

ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-X మరియు Dolby Atmos రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో రెండు 100 W హెవీ సౌండ్ కూడా అందుతుంది. అదీకూడా 4.1.2 సిస్టం తో అందించింది. అంటే, ఎటువంటి హోమ్ థియేటర్ సిస్టం అవసరం లేకుండా Deep Bass మరియు సరౌండ్ సౌండ్ ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ టీవిలో రెండు వైపులా 2 + 2 స్పీకర్లు, ఒక ఉఫర్ మరియు టీవీకి పైన వైపున రెండు స్పీకర్లు ఉంటాయి.      

మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ టీవీ లో మరొక ప్రత్యేకత ఉంది. అదే ఈ టీవీ లో అందించిన డ్యూయల్ 48ఎంపీ పాప్ అప్ కెమెరా. ఈ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ తో పాటుగా ఆన్లైన్ క్లాసుల వంటి అన్ని స్మార్ట్ అవసరాలకు ఉపయోగపడుతుంది.             

ఈ షియోమి టీవీలో మీకు మల్టి కనెక్టివిటీ లభిస్తుంది. ఇందులో, WiFi 6 సపోర్ట్ , HDMI 2.0 మరియు eARC తో పాటుగా 2USB పోర్ట్స్  కూడా ఉన్నాయి. ఇది Android మరియు PatchWall OS తో  పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo