Kodak Smart TV: అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొడాక్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
2025 దసరా మరియు దీపావళి పండుగ సీజన్ కోసం కొడాక్ కొత్త ఆఫర్లు ప్రకటించింది
పండుగ సీజన్ సందర్భంగా Kodak Smart TV రేట్లు భారీగా తగ్గించింది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నుంచి ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి
2025 దసరా మరియు దీపావళి పండుగ సీజన్ కోసం కొడాక్ కొత్త ఆఫర్లు ప్రకటించింది. అదేమిటంటే, ఈ పండుగ సీజన్ సందర్భంగా Kodak Smart TV రేట్లు భారీగా తగ్గిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా అనౌన్స్ చేసింది మరియు కొత్త డిస్కౌంట్ రేట్లు కూడా ప్రకటించింది. కొడాక్ ప్రకారం, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నుంచి ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.
SurveyKodak Smart TV ఆఫర్ ఏమిటి?
కొడాక్ ఇండియాలో మంచి అమ్మకాలను సాధించిన స్మార్ట్ టీవీ బ్రాండ్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రాండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ భారీ స్మార్ట్ టీవీ ఆఫర్స్ అందించింది. కంపెనీ ప్రకారం, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న ఈ రెండు బిగ్ సేల్స్ నుంచి ఈ టీవీ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.
ఈ రెండు సేల్స్ నుంచి కూడా కొడాక్ స్మార్ట్ టీవీలు కొత్త డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతాయి. ఇందులో 24 ఇంచ్ టీవీ మొదలుకొని 65 ఇంచ్ స్మార్ట్ టీవీ వరకు ఉన్నాయి. రీసెంట్ గా భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త GST 2.0 కూడా ఈ టీవీ రేట్లు తగ్గడానికి సహాయం చేసినట్లు కొడాక్ తెలిపింది. అంటే, ఈ టీవీలు కొత్త జీఎస్టీ టాక్స్ కు అనుగుణంగా ఉంటాయని మనం ఊహించవచ్చు.
Also Read: Meta Ray-Ban Display: సైన్స్ ఫిక్షన్ సినిమా తలపించే కొత్త స్మార్ట్ కళ్ళజోడు తెచ్చిన మెటా.!
Kodak Smart TV కొత్త రేట్స్ ఏమిటి?
పండుగ సీజన్ 2025 కోసం కొడాక్ స్మార్ట్ టీవీ కొత్త ఆఫర్ రేట్లు కొడాక్ లిస్ట్ చేసింది. కొడాక్ (24) ఇంచ్ (24QSE500) మోడల్ టీవీ ధర ప్రస్తుతం రూ. 6,999రూపాయలు ఉండగా సేల్ నుంచి రూ. 1,200 భారీ తగ్గింపు తో కేవలం రూ. 5,799 ధరకే లభిస్తుంది. కొడాక్ (32) ఇంచ్ (329X5051) మోడల్ టీవీ ధర ప్రస్తుతం రూ. 10,499 రూపాయలు ఉండగా సేల్ నుంచి రూ. 1,000 భారీ తగ్గింపు తో కేవలం రూ. 9,499 ధరకు లభిస్తుంది. అలాగే, కొడాక్ (65) ఇంచ్ (65ST5035) మోడల్ టీవీ ధర ప్రస్తుతం రూ. 45,499 రూపాయలు ఉండగా పండుగ సీజన్ సేల్ నుంచి రూ. 8,000 భారీ తగ్గింపు తో కేవలం రూ. 45,999 ధరకు లభిస్తుంది. కొడాక్ అందించిన స్మార్ట్ టీవీ పూర్తి ప్రైస్ పట్టిక క్రింద చూడవచ్చు.

ఈ కొత్త ఆఫర్ రేట్ తో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి టీవీ SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో ఈ టీవీలు కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి Axis, ICICI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డు తో టీవీలు కొనుగోలు చేసే వారికి కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కొడాక్ అందించిన ఈ బిగ్ డీల్స్ తో 2025 పండుగ సీజన్ నుంచి అతి చవక ధరకే కొడాక్ స్మార్ట్ టీవీలు లభిస్తాయని క్లియర్ గా అనౌన్స్ చేసింది.