get latest Thomson QLED Smart Tv at lowest price on flipkart summer sale
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన సమ్మర్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ ఆన్ గోయింగ్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ ని లిస్ట్ అవుట్ చేసింది. ముఖ్యంగా, ఈ సేల్ నుంచి Thomson QLED Smart Tv లను గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో అతి చవక ధరలో అందుకునే అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన టాప్ థామ్సన్ స్మార్ట్ టీవీ డీల్స్ ని ఈ రోజు ప్రత్యేకంగా అందించాము.
2025 సంవత్సరం చివరి సమయంలో Jio Tele OS సపోర్టుతో థామ్సన్ అందించిన క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్ ను ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్స్ తో అతి చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ సిరీస్ నుంచి 32 ఇంచ్ మొదలుకొని 55 ఇంచ్ వరకు అన్ని పరిమాణాల్లో క్యూలెడ్ స్మార్ట్ టీవీలను అందించింది. ఈ టీవీలు మంచి ఫీచర్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జియో టెలీ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తాయి. ఈ టీవీ ఆఫర్ ధర మరియు టీవీ ఫీచర్స్ వివరంగా చూద్దాం.
వీటిలో 32 ఇంచ్ టీవీ పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేదు. అయితే, 43 ఇంచ్ టీవీ మరియు 50 ఇంచ్ టీవీ పై రూ. 1,250 రూపాయల ICICI బ్యాంక్ ఆఫర్ అందించింది. ఈ సిరీస్ లో బిగ్ టీవీ అయిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై రూ. 1,750 రూపాయల అదనపు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ లు మరింత చవక ధరలో లభిస్తాయి.
Also Read: రేపు Nova Series నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్న Ai Plus బ్రాండ్.!
అంటే, మీరు కేవలం 25 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కూడా లేటెస్ట్ థామ్సన్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ థామ్సన్ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు లేటెస్ట్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. 32 ఇంచ్ టీవీ తప్ప మిగిలిన మూడు టీవీలు కూడా 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు Amlogic క్వాడ్ కోర్ చిప్ సెట్ తో నడుస్తాయి మరియు 2 జీబీ ర్యామ్ జతగా 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ టీవీ 450 నిట్స్ బ్రైట్నెస్ మరియు 4K HDR తో మంచి విజువల్స్ అందిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ జియో టెలీ OS పై నడుస్తుంది మరియు 400 వరకు ఉచిత ఛానల్స్ కి యాక్సెస్ అందిస్తుంది.
ఈ టీవీ లో రెండు బాక్స్ స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో టోటల్ 48W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి.