Flipkart Sale best 55 inch QLED Smart Tv today
Flipkart Sale నుంచి ఈరోజు ఒక బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ అందించింది. ఈ డీల్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అంటే, ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 25 వేల బడ్జెట్‌లోనే లభిస్తుంది. ఇటీవల కూడా ఈ టీవీ 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అయ్యింది. అయితే, రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ టీవీ బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది.
realme TechLife లైఫ్ లేటెస్ట్ గా అందించిన 55 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ 55UHDGQRDDVQ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన 57% డిస్కౌంట్ తో రూ. 27,499 రూపాయల డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొనుగోలు చేసే రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్లతో రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 రూపాయల అతి తక్కువ ధరకే మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.
Also Read: Amazon GIF Sale End Date అనౌన్స్ చేసిన అమెజాన్: ఈ బెస్ట్ డీల్స్ మిస్సవ్వకండి.!
రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ, 5 సౌండ్ మోడ్స్ మరియు AI సౌండ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.