TCL 55 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

TCL 55 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది

ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో అందించి బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది

ఈ టీవీ డాల్బీ విజయం మరియు డాల్బీ అట్మాస్ వంటి మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది

TCL 55 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది.!

TCL గత సంవత్సరం విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో అందించి బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది. ఈ టీవీ డాల్బీ విజయం మరియు డాల్బీ అట్మాస్ వంటి మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL 55 QLED Smart Tv : డీల్

టిసిఎల్ 2025 చివరిలో అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ 55T6C పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్లు జత చేసింది. ఈ టీవీ పై ఈరోజు 61% భారీ డిస్కౌంట్ జత చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కేవలం రూ. 32,990 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ చేస్తోంది.

TCL 55 QLED Smart Tv deal on flipkart

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీ ని ఏదైనా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ లేదా UPI ఆప్షన్ తో పేమెంట్ చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 31,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: BSNL Super Offer: మరో వారంలో క్లోజ్ అవబోతున్న ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ మిస్ అవ్వకండి.!

TCL 55 QLED Smart Tv : ఫీచర్స్

ఈ టిసిఎల్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన క్యూలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ AiPQ క్వాడ్ ప్రోసెసర్ జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10+, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన స్పీకర్ సెటప్ తో టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS Virtual:X సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈటీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, LAN, AV IN, HDMI, USB, ఆప్టికల్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ టిసిఎల్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo