SAMSUNG Smart Tv పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. బడ్జెట్ ధరలో శామ్సంగ్ లాంటి బిగ్ బ్రాండ్ స్మార్ట్ టీవీ కోసం కోసం చూస్తున్న యూజర్లు ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బెస్ట్ డీల్ ను చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీ గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
SAMSUNG Smart Tv: ఆఫర్
శామ్సంగ్ 2024 లో రూ. 66,990 రూపాయల MRP ధరతో క్రిస్టల్ UHD DU7000 సిరీస్ నుంచి విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 41% భారీ డిస్కౌంట్ తో రూ. 39,279 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై BOBCARD EMI మరియు 10% డిస్కౌంట్ అఫర్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ రూ. 1,250 డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ 38 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇదే మోడల్ స్మార్ట్ టీవీ శామ్సంగ్ స్టోర్ నుంచి రూ. 51,990 ధరతో సేల్ అవుతోంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+, 4K అప్ స్కేలింగ్ మరియు మెగా కాంట్రాస్ట్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Crystal Processor 4K తో పని చేస్తుంది మరియు స్మూత్ గా నడుస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ తోటకు 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈటీవీ OTS Lite, అడాప్టివ్ సౌండ్ మరియు Q-Symphony వంటి సౌండ్ ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. HDMI, USB, AV ఇన్, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
అయితే, ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కాదు. ఈ స్మార్ట్ టీవీ శామ్సంగ్ యొక్క Tizen OS పై నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ల్యాగ్ ఫ్రీ యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ రేటు కారణంగా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి తక్కువ రేటింగ్ అందుకుంది. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న డిస్కౌంట్ ధరలో ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ తగిన డీల్ అయ్యే అవకాశం ఉంది.