బిగ్ డీల్: 19 వేలకే బిగ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

చాలా చవక ధరకే లేటెస్ట్ QLED Smart Tv ని అందుకునే అవకాశం

ది బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే స్మార్ట్ టీవీల పై గొప్ప ఆఫర్లు ప్రకటించింది

ఈ గొప్ప క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు చూద్దాం

బిగ్ డీల్: 19 వేలకే బిగ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

బిగ్ డీల్: చాలా చవక ధరకే భారత మార్కెట్ లో విడుదలైన లేటెస్ట్ QLED Smart Tv ని అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ నుంచి 2024 లో లేటెస్ట్ వచ్చిన కొత్త స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. త్వరలో ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించనున్న ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ కంటే ముందే స్మార్ట్ టీవీల పై గొప్ప ఆఫర్లను ప్రకటించడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు అందించిన ఈ గొప్ప క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా బిగ్ QLED Smart Tv డీల్?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak ఈ 2024 లో విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43MT5055 పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 34% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ రూ. 20,999 ధరకు లభిస్తోంది. అదనంగా, ఈ టీవీ పైన రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్ పొందడానికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో ఈ టీవీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: Realme 70 Turbo 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ పవర్ ఫుల్ 5జి ఫోన్ ఫస్ట్ సేల్.!

Kodak QLED Smart Tv : ఫీచర్స్

కొడాక్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ AMO display టెక్నాలజీ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Kodak QLED Smart Tv

ఈ టీవీ లో 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Atmos, డాల్బీ డిజిటల్ మరియు dts ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI Arc, USB, బ్లూటూత్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. చవక ధరలు క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile