Flipkart Big Deal: రూ. 22,999 ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రకటించింది

రూ. 23,999 రూపాయలకే భారీ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ తో పాటు మంచి సౌండ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది

Flipkart Big Deal: రూ. 22,999 ధరకే బ్రాండెడ్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకోండి.!

Flipkart Big Deal: ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రకటించింది. ఎన్నడూ చూడని విధంగా భారీ డిస్కౌంట్ తో కేవలం 23,999 రూపాయలకే భారీ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. ఈ స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ తో పాటు మంచి సౌండ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆ డీల్ ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా Flipkart Big Deal?

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa యొక్క లేటెస్ట్ బిగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘55S3U Plus’ ని 58% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకు అందుకోవడానికి వీలుగా ఈ టీవీ పై భారీ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

Flipkart Big Deal on coocaa 55 inch 4K smart tv

ఈ స్మార్ట్ టీవీని BOBCARD కార్డ్ తో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్, Federal Bank EMI ఆఫర్ తో ఈ టీవీ కొనేవారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 22,999 రూపాయల అతి తక్కువ ధరకే పొందే అవకాశం వుంది.

Coocaa (55) UHD 4K LED : ఫీచర్స్

ఈ 55 ఇంచ్ కూకా స్మార్ట్ టీవీ ఫ్రెమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు Chameleon Extreme 2.0 పిక్చర్ ఇంజిన్ తో పని చేస్తుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన DLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది.

Also Read: Infinix Hot 50 5G: కొత్త డిజైన్ మరియు కెమెరా మోడ్యూల్ తో కొత్తగా వస్తోంది.!

ఈ స్మార్ట్ టీవీ 30W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీలో 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. అయితే, ఈ టీవీ Netflix మరియు డిస్నీ + హాట్ స్టార్ యాప్స్ కి సపోర్ట్ చెయ్యదు. కానీ, చాలా చవక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ ఆఫర్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo