Infinix Hot 50 5G: కొత్త డిజైన్ మరియు కెమెరా మోడ్యూల్ తో కొత్తగా వస్తోంది.!
ఇన్ఫినిక్స్ సెప్టెంబర్ 5న కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ ఫోన్ ను కొత్త డిజైన్ మరియు కెమెరా మోడ్యూల్ తో లాంచ్ చేస్తోంది
Infinix Hot 50 5G టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ డిజైన్ ను వెల్లడించింది.
Infinix Hot 50 5G: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ సెప్టెంబర్ 5న కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కొత్త డిజైన్ మరియు కెమెరా మోడ్యూల్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ డిజైన్ ను వెల్లడించింది.
SurveyInfinix Hot 50 5G
ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Hot 50 5G ని సెప్టెంబర్ 5న లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు కెమెరా మాడ్యూల్ తో వస్తోంది. ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో ఈ ఫోన్ టీజింగ్ వివరాలు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ కేవలం 7.8mm తో చాలా స్లిమ్ గా ఉంటుందని ఇన్ఫినిక్స్ ఈ పేజీ ద్వారా తెలిపింది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ కెమెరా మోడ్యూల్ ను రెగ్యులర్ గా కాకుండా వినూత్నమైన స్క్వేర్ షేప్ లో అందించింది. ఇది చూడటానికి అందంగా మరియు విలక్షణంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాతో జతగా డ్యూయల్ ఫ్లాష్ ను కూడా సపోర్ట్ గా అందించింది.
ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది. ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ ఫోన్ హాట్ 50 5జి ఫోన్ ను అధిక రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో కూడా అందించే అవకాశం ఉంటుంది.
Also Read: Samsung Crystal 4K Dynamic Series నుంచి రెండు కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన శామ్సంగ్.!
ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్, క్లియర్ ఇమేజ్ లను అందించ గల మంచి కెమెరా సిస్టం మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ అయ్యే అవకాశం వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile