Flipkart బిగ్ డిస్కౌంట్ తో 50 ఇంచ్ QLED Smart Tv కేవలం 21 వేలకే లభిస్తోంది.!
Flipkart ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది
త్త 50 ఇంచ్ QLED Smart Tv కొనాలని సెర్చ్ చేసే వారికి తగిన డీల్
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన GST 2.0 అమలు తర్వాత స్మార్ట్ టీవీ ధరలు బాగా తగ్గాయి
Flipkart ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది. అంతేకాదు, కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త 50 ఇంచ్ QLED Smart Tv కొనాలని సెర్చ్ చేసే వారికి తగిన డీల్ గా ఇది ఉంటుంది. దేశంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన GST 2.0 అమలు తర్వాత స్మార్ట్ టీవీ ధరలు బాగా తగ్గాయి. దీనికి తోడు ఈకార్ట్ ప్లాట్ ఫామ్స్ అందించే అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో స్మార్ట్ టీవీ ధరలు మరింత చవకగా మారాయి.
SurveyFlipkart QLED Smart Tv : ఆఫర్
Thomson రీసెంట్ గా Jio Tele OS తో మార్కెట్లో కొత్తగా విడుదల చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 37% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,699 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని BOB CARD, SBI మరియు HSBC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో తీసుకునే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,199 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ Moto G67 Power 5G ఫస్ట్ సేల్.!
Thomson QLED Smart Tv :
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్లీక్ బెజెల్ కలిగిన స్టన్నింగ్ డిజైన్ తో అక్కట్టుకుంటుంది. ఈ టీవీ VIVID కలర్ మరియు HDR సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ Jio Tele OS తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో 2 ఉఫర్ స్పీకర్లు ఉంటాయి మరియు ఈ టీవీ టోటల్ 48W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్, HDMI, USB, AV ఇన్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఫ్లిప్ ఆకృతి యూజర్ల నుంచి 4.2 రేటింగ్ అందుకుంది.