ఇండియాలో చాలా చౌక ధరకే తన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్

HIGHLIGHTS

కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది.

ఇండియాలో చాలా చౌక ధరకే తన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్

ఇండియాలోని LED టీవీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని, గ్లోబల్ టీవీ బ్రాండ్ అయినటువంటి COOCA తన టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. వాస్తవానికి, ఇప్పటి వరకూ అనేక దేశాలలో తన అమ్మకాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇండియాలో తన LED టీవీలను చాల చౌక ధరలో అందించింది. ఈ LED టీవీలను 32 అంగుళాల పరిమాణం నుండి కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ టీవీల ప్రత్యేకతల విషయాని వస్తే, ఈటీవీలను అనేకమైన ప్రత్యేకతలతో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. వీటిలో, Dolby Vision, Dolby Audio మరియు కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసే "యాంటీ బ్లూ లైట్ ఐ ప్రొటక్షన్" వంటి వాటిని ముఖ్యమైన వాటిగా చెప్పొచ్చు. అలాగే, చాలా తక్కువ ధరలో అతి సన్నని అంచులు కలిగిన బెజెల్ లెస్ టీవీలను కూడా భారతీయ మార్కెట్లోకి పరిచయం చేసింది.

ఈ LED టీవీల దారాలను పరిశీలిస్తే, ఈ LED టీవీలను కేవలం రూ. 8,999 ప్రారంభ ధరతో అందించింది. అయితే, ఈ ప్రారంభ ధరలో మీకు 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED టీవీ దొరుకుతుంది. అలాగే, ఒక 50 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని కేవలం రూ. 24,499 రూపాయల ధరకు మరియు  50 అంగుళాల 4K UHD ఆండ్రాయిడ్ టీవీ ని రూ. 28,499 రుపాయల ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. కొత్తగా లాంచ్ చేసిన, ఈ LED టీవీలను ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారం అయినటువంటి Flipakrt ద్వారా అమ్ముడు చేస్తోంది.    

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo