QLED TV: భారీ డిస్కౌంట్ తో 30 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ..!
QLED TV: పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు Flipkart అందించిన బిగ్ డీల్ తో బ్రాండెడ్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. 30 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyQLED TV Offer
ఫ్లిప్ కార్ట్ ఈరోజు MOTOROLA EnvisionX సిరీస్ 55 ఇంచ్ క్యూలెడ్ UHD 4K స్మార్ట్ టీవీ పైన 74% భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అందుకే, ఈ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 29,999 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ మోటోరోలా బిగ్ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ పొందుతారు.
అంటే, ఈరోజు ఈ మోటోరోలా బిగ్ 55 ఇంచ్ క్యూలెడ్ 4K స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్ తో రూ. 28,499 రూపాయల ధరకే సొంతం చేసుకోవచ్చు. అదే BOBCARD EMI ఆఫర్ తో అయితే, రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే, ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 27,999 రూపాయల ధరకే అందుకునే వీలుంది.
Also Read: Samsung Galaxy F15 5G: ప్రీమియం డిజైన్ మరియు 6000mAh బ్యాటరీతో వస్తోంది.!
MOTOROLA EnvisionX స్మార్ట్ టీవీ స్పెక్స్
MOTOROLA EnvisionX క్యూలెడ్ స్మార్ట్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision సపోర్ట్ తో మంచి విజువల్స్ ను అందించ గలదు. ఈ స్మార్ట్ టీవీ MediaTek 9602 ప్రోసెసర్, 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos, Dolby Digital మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile