అమెజాన్ నుండి కేవలం 25 వేలకే బ్రాండ్ న్యూ 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్..!!

అమెజాన్ నుండి కేవలం 25 వేలకే బ్రాండ్ న్యూ 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్..!!
HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ గొప్ప స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది

4K UHD స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే అఫర్ చేస్తోంది

అమెజాన్ నుండి చాలా చవక ధరకే లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ

ఈరోజు అమెజాన్ గొప్ప స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది. బ్రాండ్ న్యూ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు గూగుల్ వాయిస్ సపోర్ట్, 5G Wi-Fi, అల్ట్రా డిమ్మింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అందుకే, అమెజాన్ నుండి చాలా చవక ధరకే లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ను మీకోసం అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.

ఈస్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని ఫ్లిఅమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అమ్ముడు చేస్తోంది. అమెజాన్ నుండి స్టాండర్డ్ చార్టర్డ్ మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 7.5 % డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Foxsky 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo