రూ.30 వేల కంటే తక్కువ ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు అందుకోండి!!
ఈరోజు చాలా మంచి స్మార్ట్ టీవీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
అమెజాన్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది
0 ఇంచ్ సైజుతో వచ్చే 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్
బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున వారికి ఈరోజు చాలా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అమెజాన్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది. తద్వారా, ఈ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకే, బిగ్ స్మార్ట్ టీవీని బెస్ట్ డీల్స్ తో తక్కువ ధరకే కొనాలని చూస్తున్న వారికోసం ఈరోజు ఇక్కడ అఫర్ వివరాలను అందిస్తున్నాను. ఈ టీవీలు అన్ని కూడా కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి మరియు ఇవి 50 ఇంచ్ సైజుతో వచ్చే 4K UHD స్మార్ట్ టీవీలు. మరి ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
SurveyShinco (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .27,000
అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 36% బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 28,000 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ షింకో స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
iFFALCON (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .28,990
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ ఐఫాల్కన్ 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 24 W సౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
KODAK (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.29,499
ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 30% డిస్కౌంట్ తో Rs.29,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile