అండర్ రూ. 20,000 ధరలో లభించే బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv పై ఒక లుక్కేద్దామా.!
భారత్ మార్కెట్లో స్మార్ట్ టీవీలు ప్రస్తుతం మంచి ఫీచర్స్ తో ఆకర్షణీయమైన ప్రైస్ తో లభిస్తున్నాయి
ఈరోజు అండర్ రూ. 20,000 ధరలో లభించే స్మార్ట్ టీవీల వివరాలు
ఈ రెండు స్మార్ట్ టీవీ వివరాలు ఇక్కడ చూడవచ్చు
భారత్ మార్కెట్లో స్మార్ట్ టీవీలు ప్రస్తుతం మంచి ఫీచర్స్ తో ఆకర్షణీయమైన ప్రైస్ తో లభిస్తున్నాయి. అందుకే, కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారి కోసం బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ టీవీ వివరాలు రెగ్యులర్ గా అందిస్తున్నాను. నిన్న మొన్న 32 ఇంచ్ మరియు 40 ఇంచ్ స్మార్ట్ టీవీ వివరాలు అందించగా, ఈరోజు 43 ఇంచ్ 4K Smart Tv వివరాలు అందిస్తున్నాను. ఈరోజు అండర్ రూ. 20,000 ధరలో లభించే స్మార్ట్ టీవీల వివరాలు అందిస్తున్నాను.
Surveyబెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv ఏమిటి?
43 ఇంచ్ స్మార్ట్ టీవీలు కేవలం రూ. 17,999 రూపాయల ప్రారంభ ధర నుంచే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని టీవీలు ప్రస్తుతం సేల్ అవ్వడం లేదు. అందుకే, ప్రస్తుతం చవక ధరలో లభిస్తున్న లేటెస్ట్ స్మార్ట్ టీవీ వివరాలు మాత్రమే అందిస్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో iFFALCON (43U65) స్మార్ట్ టీవీ మరియు Thomson (43TJQ0012) రెండు స్మార్ట్ టీవీలు కూడా బెస్ట్ టీవీలు అవుతాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

Thomson (43) 4K Smart Tv
ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో చవక ధరలో లభిస్తున్న బెస్ట్ QLED స్మార్ట్ టీవీ గా చెప్పబడుతుంది. ఇది 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది మరియు రిలయన్స్ జియో యొక్క Jio Tele OS తో నడుస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 18,499 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ టీవీపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
Also Read: Medical AI: వైద్య రంగంలో అద్భుత ఫలితాల కోసం AI ముందడుగు.!
iFFALCON (43) స్మార్ట్ టీవీ
ఇది TCL ఉప బ్రాండ్ ఐఫాల్కన్ అందించిన ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ HVA ప్యానల్ మరియు మెటాలిక్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ ప్రాసెసర్, 2జీబీ మరియు 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS X సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 24 సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీ Wi-Fi 5, HDMI, USB, LAN, AV ఇన్, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 18,999 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది.