లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించిన అమెజాన్ సేల్.!

HIGHLIGHTS

Diwali Special Sale నుంచి ఈరోజు లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఆఫర్లు అందించింది

షియోమీ స్మార్ట్ టీవీ ని బడ్జెట్ ధరలో కొనుగోలు చేసే అవకాశం అందించింది

ఈ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ పై మరొక ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది

లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించిన అమెజాన్ సేల్.!

అమెజాన్ ఇండియా దీపావళి 2024 పండుగ కోసం ప్రకటించిన Diwali Special Sale నుంచి ఈరోజు లేటెస్ట్ Xiaomi Smart Tv పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. గత నెల భారతీయ మార్కెట్ లో విడుదలైన కొత్త షియోమీ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ షియోమీ స్మార్ట్ టీవీ ని బడ్జెట్ ధరలో కొనుగోలు చేసే అవకాశం అందించింది. ఈరోజు ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ పై అమెజాన్ అందించిన ఆఫర్ మరియు ఈ టీవీ ఫీచర్స్ వివరంగా చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Smart Tv : ఆఫర్లు

షియోమీ ఇండియాలో గత నెల విడుదల చేసిన A Pro సిరీస్ యొక్క 43 ఇంచ్ గూగుల్ టీవీ మోడల్ నెంబర్ L43MA-AUIN పై ఈ డీల్ ను అందించింది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 42% భారీ డిస్కౌంట్ తో రూ. 24,999 రూపాయల ధరకు సేల్ అవుతోంది. ఈ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ మరొక ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది.

ఈ షియోమీ స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియా దివాళీ స్పెషల్ సేల్ నుంచి ICICI, Axis, BOB కార్డ్, IDFC మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ టీవీ ని ఆఫర్ ప్రైస్ మరియు బ్యాంక్ ఆఫర్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: Sony 1000W Soundbar పై అమెజాన్ దివాళీ సేల్ ధమాకా ఆఫర్.!

Xiaomi Smart Tv : ఫీచర్స్

ఈ 43 ఇంచ్ షియోమీ లేటెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రీమియం మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ లో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ టీవీ Dolby Vision, HDR 10, HLG మరియు Vivid పిక్చర్ ఇంజిన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HMDI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

అమెజాన్ పండుగ సేల్ నుంచి లభిస్తున్న ఆఫర్ ధరలో ఈ టీవీ పరీశీలించ తగిన బడ్జెట్ స్మార్ట్ టీవీ ఆఫర్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo