భారీ డిస్కౌంట్ తో LED ధరకే పెద్ద QLED Smart Tv లభిస్తోంది.!

HIGHLIGHTS

LED ధరకే పెద్ద QLED Smart Tv అందుకునే గొప్ప అవకాశం

ఆఫర్ ను ఈరోజు అమేజాన్ ఇండియా నుండి అందిస్తోంది

QLED Smart Tv ని 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే వీలుంది

భారీ డిస్కౌంట్ తో LED ధరకే పెద్ద QLED Smart Tv లభిస్తోంది.!

LED ధరకే పెద్ద QLED Smart Tv అందుకునే గొప్ప అవకాశం ఈరోజు మీ ముందుంది. ఆఫర్ ను ఈరోజు అమేజాన్ ఇండియా నుండి అందిస్తోంది. మీరు కూడా బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు అమెజాన్ నుండి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ ను పరిశీలించండి. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

QLED Smart Tv Offer

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak ఇటీవల అందించిన 43 ఇంచ్ 4K స్మార్ట్ క్యూలెడ్ టీవీ మోడల్ నెంబర్ 43MT5055 పైన ఈరోజు ఈ బెస్ట్ డీల్ లభిస్తోంది. ముందుగా రూ. 31,999 రూపాయల ధరతో సేల్ అయిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

ఈ టీవీ పైన ఇతర ఆఫర్లు ఏమైనా ఉన్నాయా?

అవును ఈ కోడాక్ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అమేజాన్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ Debit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, OneCard Credit Card EMI ఆప్షన్ తో ఈ టీవీ కొనే వారికి కూడా రూ. 1,200 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్లతో ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే వీలుంది.

Also Read: Vivo V30: స్టన్నింగ్ డిజైన్ మరియు ప్రత్యేకతలతో వచ్చిన వివో కొత్త ఫోన్.!

Kodak (43) 4K UHD Smart QLED TV

ఇక ఈ కోడాక్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు BT వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ కోడాక్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ జతగా 2GB RAM మరియు 16GB ROM తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కోడాక్ తెలిపింది.

ఈ కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR10+, HLG, MEMC మరియు Dolby Vision సపోర్ట్ గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీలో అందించిన 40W స్పీకర్లు మరియు Dolby Atmos, DTS, Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo