amazon great summer sale offers big discount on Samsung 4K Smart Tv
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ని ఆఫర్ చేసింది. ఈ సేల్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ లో Samsung 4K Smart Tv గొప్పగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం 23 వేల రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. వాస్తవానికి, ఈ టీవీ 30 వేల రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యేది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ పుణ్యమా అని చవక ధరలో లభిస్తోంది.
శాంసంగ్ క్రిస్టల్ 4కె విస్తా సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 27,240 ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రెండు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే ఈ టీవీ చవక ధరలో లభిస్తుంది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై ఈరోజు రూ. 2,250 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, రూ. 1,750 రూపాయల అదనపు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 23,240 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీని ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో నేరుగా కొనాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read: Vivo V70 FE 5G: లేటెస్ట్ వివో 200MP కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ డీల్స్ అందుకోండి.!
ఈ శాంసంగ్ 43 ఇంచ్ టీవీ LED స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) మరియు 50 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10+ సపోర్ట్, HLG , UHD డిమ్మింగ్, మెగా కాంట్రాస్ట్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Crystal Processor 4K ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 7 సంవత్సరాల OS అప్గ్రేడ్ సపోర్టుతో వస్తుంది. ఈ టీవీ 100 కు ఉచిత చానల్స్ అందించే శాంసంగ్ టీవీ ప్లస్ యాక్సెస్ తో వస్తుంది వెబ్ OS తో పని చేస్తుంది.
ఈ టీవీ సౌండ్ పరంగా కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. శాంసంగ్ స్మార్ట్ టీవీలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అదనంగా, ఈ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.