Vivo V70 FE 5G: లేటెస్ట్ వివో 200MP కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

వివో గత నెల ప్రారంభంలో భారీ 200MP కెమెరా ఫోన్ వివో వి 70 FE లాంచ్ చేసింది

Vivo V70 FE 5G పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ SASA LELE బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్స్ తో మరింత బడ్జెట్ ధరలో ఈ ఫోన్ లభిస్తుంది

Vivo V70 FE 5G: లేటెస్ట్ వివో 200MP కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ డీల్స్ అందుకోండి.!

Vivo V70 FE 5G: వివో గత నెల ప్రారంభంలో భారీ 200MP కెమెరా ఫోన్ వివో వి 70 FE లాంచ్ చేసింది. ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ SASA LELE బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. వివో ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరాతో రిలీజ్ చేసింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్స్ తో మరింత బడ్జెట్ ధరలో ఈ ఫోన్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V70 FE 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

వివో ఈ కొత్త ఫోన్ ను రూ. రూ. 37,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రోజు కూడా ఇదే ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను గూగుల్ పే, ఫోన్ పే, HDFC మరియు SBI క్రెడిట్ కార్డు తో పేమెంట్ రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 34,999 స్టార్టింగ్ ప్రైస్ లో లభిస్తుంది.

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ లభించే ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

Vivo V70 FE 5G flipkart sale deal

ఆఫర్ ప్రైస్

  • వివో వి70FE (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 34,999
  • వివో వి70FE (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 37,999
  • వివో వి70FE (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 41,999

ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నాథర్న్స్ లైట్ పర్పల్ మరియు మాన్సూన్ బ్లూ అనే రెండు సరికొత్త రంగుల్లో లభిస్తుంది.

Also Red: LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Vivo V70 FE 5G: ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ పవర్ ఫుల్ ఫోన్ గా అందించింది. ఈ ఫోన్ లో 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్, మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను స్లీక్ డిజన్ లో కొత్త డార్క్ నెస్ గ్లో టెక్నాలజీ ఫీచర్ తో అందించింది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో గరిష్టంగా 12 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ స్టోరేజ్ అందించింది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరా గురించి కంపెనీ గొప్పగా తెలిపింది. ఎందుకంటే, ఈ ఫోన్ లో అల్ట్రా స్టెబిలైజేషన్ ఫీచర్ కలిగిన 200MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఇందులో, అల్ట్రా స్టేబుల్ 4K వీడియో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మరియు AI కెమెరా ఫీచర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క మరో గొప్పతనం గురించి చెప్పాలంటే, ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నా కూడా 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంది. వివో ఈ ఫోన్ లో వేగవంతమైన 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile