Sony BRAVIA Smart Tv పై రూ. 8500 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Sony BRAVIA Smart Tv ఈరోజు రూ. 8500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది

ఈ డిస్కౌంట్ ఆఫర్ తో సోనీ స్మార్ట్ టీవీ ని ఈరోజు మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది

ఈ స్మార్ట్ టీవీ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా

Sony BRAVIA Smart Tv పై రూ. 8500 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Sony BRAVIA Smart Tv ఈరోజు రూ. 8500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో సోనీ స్మార్ట్ టీవీ ని ఈరోజు మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది. సోనీ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదల చేసిన బ్రావియా 2M2 Series 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony BRAVIA Smart Tv: ఆఫర్

సోనీ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ బ్రావియా 2M2 సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ K-43S22BM2 ఈరోజు ఈ బిగ్ డీల్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ని అమెజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఇక డీల్ విషయానికి వస్తే, అమెజాన్ ఈ రోజు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 8500 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ను అన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఆప్షన్ పై అందించింది.

Sony BRAVIA Smart Tv deal on amazon sale

ఈ స్మార్ట్ టీవీని ఈరోజు రూ. 47,990 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ బిగ్ డీల్ ని ఈ టీవీ పై అందించింది. అంటే, ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 39,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: 6వ వార్షికోత్సవ సేల్ నుంచి iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించిన ఐకూ.!

Sony BRAVIA Smart Tv: ఫీచర్స్

సోనీ బ్రావియా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ప్రత్యేకమైన 4K Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది. లైవ్ కలర్, 4K X రియాలిటీ ప్రో, HDR10 మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్ మరియు గేమ్ మెనూ వంటి ఫీచర్స్ తో కూడా వస్తుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 20 వాట్స్ సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ ఓపెన్ బఫెల్ స్పీకర్ కలిగి ఉంటుంది కాబట్టి మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ అట్మోస్, DTS డిజిటల్ సరౌండ్, DTS:X మరియు డాల్బీ ఆడియో వంటి బెస్ట్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, 4 HDMI, 2USB, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo