6వ వార్షికోత్సవ సేల్ నుంచి iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించిన ఐకూ.!

HIGHLIGHTS

ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఐకూ 6వ వార్షికోత్సవ సేల్ అనౌన్స్ చేసింది

ఈ బిగ్ సేల్ నుంచి ఐకూ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించింది

ఈ ఐకూ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది

6వ వార్షికోత్సవ సేల్ నుంచి iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించిన ఐకూ.!

ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఐకూ 6వ వార్షికోత్సవ సేల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ ఇండియా నుంచి ప్రకటించిన ఈ బిగ్ సేల్ నుంచి ఐకూ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ ని మంచి డిస్కౌంట్ ధరలో అందుకొండని ఐకూ ప్రకటించింది. మరి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఐకూ అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z10 5G : డీల్స్

ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 24,999 రూపాయల ధరతో లిస్ట్ చేసిన ఐకూ, ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

iQOO Z10 5G : ఫీచర్స్

ఈ ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ (2392 × 1080), 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 4nm టెక్నాలజీ ప్రోసెసర్ మరియు 8 లక్షల వరకు AnTuTu స్కోర్ అందిస్తుంది.

iQOO Z10 5G deal on amazon sale

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony IMX 882 (OIS) మెయిన్ కెమెరా మరియు 2MP బోకే కెమెరా ఉంటాయి. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి.

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఈరోజు మిస్సయితే మళ్ళీ దొరకదు.!

ఈ ఐకూ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo